న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

#10YearChallenge: అగ్రస్థానంలో కోహ్లీ, పదేళ్ల తర్వాత ధోని ఇలా

India vs Australia: ICC Twests About '10 Year Challenge' By Comparing Test Rankings In 2009 To 2019
ICC takes up the #10YearChallenge, shares pictures of MS Dhoni, ICC rankings

హైదరాబాద్: ఫిట్‌నెస్‌ చాలెంజ్, కికీ చాలెంజ్, ఐస్‌ బకెట్‌ చాలెంజ్ ఇలా ఏదో ఓ కొత్త చాలెంజ్‌ రావడం అది సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇప్పటివరకు మనం చూశాం. తాజాగా అదే తరహాలో ఇప్పుడు '#10YearChallenge' సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి.

ప్రేమలో పడిన పంత్!: అమ్మాయి ఎవరో తెలుసా? (ఫోటోలు)ప్రేమలో పడిన పంత్!: అమ్మాయి ఎవరో తెలుసా? (ఫోటోలు)

ఈ చాలెంజ్‌‌లో ఇప్పటికే సినీతారలు, నెటిజన్లు తమ ఫోటోలను షేర్‌ చేస్తూ, పదేళ్లలో తమ జీవితంలో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటు తమ సన్నిహితులకు, స్నేహితులకు కూడా ఈ ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కూడా 'టెన్‌ ఇయర్‌ చాలెంజ్‌'ను స్వీకరించి తమ అధికారిక వెబ్‌ సైట్‌లో పలు ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఐసీసీ '#10YearChallenge'లో

ఈ ట్వీట్స్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఐసీసీ '#10YearChallenge'లో పదేళ్ల క్రితం అంటే 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా.. 2019లో ఇప్పటివరకు టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ ట్వీట్ చేసింది.

2019లో అగ్రస్థానంలో కోహ్లీ

ఈ ట్వీట్ ప్రకారం.. 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌లో ఉన్న ఆటగాళ్లలో నెంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా వెస్టిండీస్‌‌కు చెందిన ఆటగాడు శివనారాయణ్‌ చందర్‌పాల్‌ ఉండగా, ప్రస్తుతం అంటే 2019లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

బీసీసీఐ ఇలా

ఇక బౌలింగ్‌ జాబితాలో శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అగ్రస్ధానంలో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా బీసీసీఐ సైతం ఈ ‘#10YearChallenge'లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

Story first published: Thursday, January 17, 2019, 15:13 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X