బౌలింగ్ సరిగా లేదు: ఫాస్ట్ బౌలర్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ

Posted By:
ICC suspends Brian Vitori from bowling in international cricket

హైదరాబాద్: బౌలర్ యాక్షన్ సరిగ్గా లేని కారణంగా జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్రెయిన్ విటోరిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐసీసీ సస్పెండ్ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయిర్ మ్యాచ్‌ల్లో భాగంగా మార్చ్ 6న ఆప్గనిస్థాన్‌తో మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో 28 ఏళ్ల విటోరి బౌలింగ్ సరిగ్గా లేదని గుర్తించిన మ్యాచ్ అధికారులు ఐసీసీకి నివేదించారు. దీంతో అతడిపై ఐసీసీ నిషేధం విధించింది. విటోరిని ఐసీసీ సస్పెండ్ చేయడం ఇది మూడోసారి. బ్రెయిన్ విటోరి బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన వీడియో పుటేజీని ఈవెంట్ ప్యానెల్ సభ్యులు ఐసీసీకి సమర్పించారు.

వీడియో పుటేజీలను పరిశీలించిన ఐసీసీ ఆర్టికల్ 6.5 కింద బ్రెయిన్ విటోరి బౌలింగ్ సరిగా లేదని తేల్చింది. దీంతో వెటోరిని సస్పెండ్ చేయడంతో పాటు అతడి స్థానంలో రిచర్డ్ నగరవతో భర్తీ చేసేందుకు అనుమతిచ్చింది. గతంలో 2016 జనవరిలో, అదే ఏడాది జూన్‌లో విటోరి సస్పెన్షన్‌కి గురయ్యాడు.

ఈ ఏడాది జనవరిలో విటోరిపై సస్పెన్షన్ ముగియడంతో తిరిగి అతనికి జట్టులో చోటు కల్పించారు. కానీ అతని బౌలింగ్ యాక్షన్‌లో మార్పు కనిపించకపోవడంతో విటోరిని సస్పెండ్ చేయడంతో పాటు బౌలింగ్‌ను మెరుగుపరచుకునేందుకు అతడిని ఐసీసీ ట్రైనింగ్ సెంటర్‌కి పంపించాలని పేర్కొంది.

Story first published: Thursday, March 8, 2018, 18:49 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి