న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

900 రేటింగ్ పాయింట్లు: రెండో భారత ఆటగాడిగా కోహ్లీ చరిత్ర

By Nageshwara Rao
ICC ranking: Virat Kohli in Club 900, leaps to second spot

హైదరాబాద్: గురువారం ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని తిరిగి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 900 రేటింగ్ పాయింట్లు సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

సునీల్ గవాస్కర్ ఈ మైలురాయిని తన 50 టెస్టు మ్యాచ్ తర్వాత చేరుకున్నాడు. 1979లో ది ఓవల్ వేదికగా జరిగిన ఈ టెస్టులో గవాస్కర్ తొలి ఇన్నింగ్స్‌లో 13, రెండో ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేయడంతో 887 రేటింగ్ పాయింట్ల నుంచి ఒక్కసారిగా 916 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు.

మళ్లీ ఇన్నాళ్లకు సుమారు 39 ఏళ్ల తర్వాత కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో 900 ర్యాంకింగ్‌ పాయింట్ల మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన కెరీర్‌లో 21వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీకి ఇది 65వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. రెండో టెస్టులో కోహ్లీ (153) పరుగులు చేయడంతో 880 రేటింగ్ పాయింట్ల నుంచి 900 రేటింగ్ పాయింట్లకు చేరుకున్నాడు.

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు కూడా 900 రేటింగ్ పాయింట్లకు దగ్గరగా వచ్చినప్పటికీ ఆ మార్కుని అందుకోలేకపోయారు. 2002లో సచిన్ టెండూల్కర్ 898 రేటింగ్ పాయింట్ల వద్ద నిలిచిపోగా, 2005లో రాహుల్ ద్రవిడ్ 892 రేటింగ్ పాయింట్ల వద్ద నిలిచిపోయాడు.

మొత్తంగా టెస్టు క్రికెట్‌లో 900 రేటింగ్ పాయింట్లు అందుకున్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ 31వ బ్యాట్స్‌మెన్. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (961) రేటింగ్ పాయింట్లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ (947), లెన్ హుట్టన్ (945), రికీ పాంటింగ్, జాక్ హాబ్స్ (942) రేటింగ్ పాయింట్లతో ఉన్నారు.

కేప్‌టౌన్‌, సెంచూరియన్‌ టెస్టుల్లో నిరాశపరిచిన పుజారా టాప్‌-5లో స్థానం కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ బౌలర్ల జాబితాలో అగ్రస్థానన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకును దక్కించుకున్న రబడ ఈ సారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత బౌలర్‌ మహమ్మద్‌ షమి రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమంగా 17వ ర్యాంకులో నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక స్థానం కోల్పోయి ఐదో స్ధానంలో నిలిచాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 18:40 [IST]
Other articles published on Jan 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X