న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ సెమీస్‌ అవకాశాలు.. ఆయా జట్లకు ఎలా ఉన్నాయంటే!!

ICC Cricket World Cup 2019 Semi-Final Scenarios || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, World Cup 2019 after a month: Except Australia All Teams semi-final scenario

మెగా టోర్నీ ప్రపంచకప్‌ మే 30న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మ్యాచ్‌తో మొదలయింది. ఇప్పటికీ నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో రసవత్తరంగా మారుతోంది. లీగ్‌ మ్యాచ్‌లు తుది దశకు చేరుతుండటంతో.. సెమీస్‌లోని నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రపంచకప్‌లో పాల్గొన్న పది జట్లలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్తాన్‌లు అధికారికంగా సెమీస్‌ రేసు నిష్క్రమించాయి. ఇక శ్రీలంక అనధికారికంగా సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించినా.. ఎదో మూల చిన్న అవకాశం (కష్టమే) ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సెమీస్‌లో ఆస్ట్రేలియా :

సెమీస్‌లో ఆస్ట్రేలియా :

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా 14 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌, భారత్ 11 పాయింట్లతో ఉన్నాయి. రెండు జట్లు ఒక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్‌ చేరడం ఖాయం. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్‌లకు తదుపరి ఆడే మ్యాచ్‌లు కీలకం. ఇక నాలుగో స్థానం కోసమే తీవ్రమైన పోటీ నెలకొంది. ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు సెమీస్‌కు చేరాలని చూస్తున్నాయి. ఆయా జట్ల సెమీస్‌ అవకాశాలను ఓసారి పరిశీలిస్తే.

 భారత్‌ ఒక్కటి నెగ్గితే చాలు:

భారత్‌ ఒక్కటి నెగ్గితే చాలు:

భారత్‌ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి కాబట్టి సెమీస్ చేరడం సులువే. ఈనెల 2న బంగ్లాదేశ్‌, 6న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల్లో ఏదో ఒక దాంట్లో నెగ్గినా.. భారత్ 13 లేదా 15 పాయింట్లతో సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది.

న్యూజిలాండ్‌కు ఒక్కటే:

న్యూజిలాండ్‌కు ఒక్కటే:

న్యూజిలాండ్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. వరుసగా పాక్, ఆసీస్ చేతుల్లో ఓడిన కివీస్‌ ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. కివీస్‌ ఈ నెల 3న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా సెమీస్‌లోకి అడుగెడుతుంది. ఓడితే పాక్, బంగ్లా జట్లు కివీస్‌కు పోటీలో నిలుస్తాయి. అయితే నెట్ రన్ రేట్ కివీస్‌కు బాగా ఉండడం కలిసొచ్చే అంశం.

కివీస్‌పై గెలవాల్సిందే:

కివీస్‌పై గెలవాల్సిందే:

ఇప్పటివరకు ఆతిధ్య ఇంగ్లండ్‌ 8 మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు, మూడు పరాజయాలతో పది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం టీమిండియాపై విజయం సాధించి రేసులోకి వచ్చింది. తదుపరి బలమైన కివీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే సెమిస్ చేరుతుంది. ఒకవేళ ఓడితే ఇంగ్లండ్‌ ఆశలకు గండిపడుతుంది .అంతేకాదు పాక్, బంగ్లా జట్లు పోటీలో నిలుస్తాయి. ఇంగ్లండ్‌ ఓడి.. పాక్, బంగ్లాలు తమ తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తే ఇంగ్లండ్‌ నిష్క్రమించాల్సిందే. ముఖ్యంగా పాక్ ఒక్క విజయం సాధించినా ఇంగ్లండ్ పని అంతే.

 ఇంగ్లండ్‌ ఓడితేనే:

ఇంగ్లండ్‌ ఓడితేనే:

ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. నాలుగు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓడిపోయింది. ఇక ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో పాక్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పాక్‌ సెమీస్‌ చేరాలంటే 5న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవాలి. అయితే అంతకన్నా ముందు ఇంగ్లండ్‌ జట్టు కివీస్‌పై ఓడిపోవాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.

రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి.. ఇంగ్లండ్‌ ఓడాలి:

రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి.. ఇంగ్లండ్‌ ఓడాలి:

బంగ్లాదేశ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలు, ఒక్క మ్యాచ్‌ రద్దవడంతో.. 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈనెల 2న భారత్‌తో, 5న పాక్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా తప్పకుండా గెలవాలి. అదే సమయంలో కివీస్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడాలి.

లంకకు కష్టమే:

లంకకు కష్టమే:

శ్రీలంక ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు పరాజయాలు, రెండు మ్యాచ్‌లు రద్దవడంతో.. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. జూన్ 1న వెస్టిండీస్, జూన్ 6న టీమిండియాతో జరిగే మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా గెలవాలి. అదే సమయంలో ఇంగ్లండ్‌, బంగ్లా, పాక్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడాలి. ఒకవేళ ఇదే జరిగినా.. రన్ రేట్ మైనస్ (-)లో ఉండడంతో సెమీస్ ఆశలు కష్టమే.

Story first published: Monday, July 1, 2019, 10:24 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X