రేసులో ఐదుగురు!: ఈ ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగుల రికార్డు బద్దలయ్యేనా?

ICC Cricket World Cup 2019 : Sachin's 673 Runs Record Will Be Broken This Year ? || Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద రికార్డులు బద్దలైన సంగతి తెలిసిందే. అందులో మొదటి రికార్డు జూన్ 18న ఇంగ్లాండ్-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బద్దలైంది. అదేంటంటే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆప్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 110 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక, రెండోది ప్రపంచకప్‌‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు. ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవడం ఇదే తొలిసారి.

సచిన్ రికార్డు బద్దలు!

సచిన్ రికార్డు బద్దలు!

ఇప్పుడు మరో రికార్డు ఈ ప్రపంచకప్‌లో బద్దలయ్యే అవకాశం ఉంది. క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు ఈ ప్రపంచకప్‌లో బద్దలయ్యే అవకాశం ఉంది. 2003 ప్రపంచకప్‌లో సచిన్ నెలకొల్పిన వ్యక్తిగత అత్యధిక పరుగులు (673) రికార్డు ఇంకా పదిలంగా ఉంది.

మూడు ప్రపంచకప్‌లు జరిగినా

మూడు ప్రపంచకప్‌లు జరిగినా

ఆ తర్వాత మూడు ప్రపంచకప్‌లు జరిగినా ఈ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేకపోయారు. అయితే, తాజా ప్రపంచకప్‌లో సచిన్ రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 440 పరుగులతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ 425 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

6 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ వార్నర్‌

6 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ వార్నర్‌

ఆ తర్వాత ఆరోన్‌ ఫించ్‌ (396), జోరూట్‌ (367), రోహిత్‌ శర్మ (319)లు ఉన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో వీరంతా ఇదే ఫామ్‌ని ప్రదర్శిస్తే సచిన్ రికార్డు బద్దలవడం ఖాయం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే 6 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్‌ వార్నర్‌ 75 పరుగుల యావరేజితో 447 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో వార్నర్‌ ఇంకా మూడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు.

వార్నర్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే

వార్నర్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే

ఈ మూడు మ్యాచ్‌ల్లో వార్నర్‌ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఇదే యావరేజితో మరో 224 పరుగులు చేసి సచిన్‌ రికార్డుకు 3 పరుగుల దూరంలో నిలుస్తాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సెమీస్ చేరడం ఖాయం. దీంతో ఆసీస్‌ జట్టుకు సెమీస్‌ వెళితే సచిన్‌ రికార్డుని వార్నర్ తప్పక బద్దలు కొడతాడు.

రోహిత్ శర్మ కూడా

రోహిత్ శర్మ కూడా

ఇక, షకీబ్‌ అల్‌ హసన్‌ ఇప్పటివరకు 425 పరుగులు చేశాడు. అతను కూడా మూడు మ్యాచ్‌లు ఆడతాడు. ఇదే యావరేజిను కొనసాగిస్తే అతడు 680 పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఆరోన్‌ ఫించ్‌, జోరూట్‌లు కూడా సచిన్‌ రికార్డు అధిగమించే రేసులో ఉన్నారు. భారత జట్టు నుంచి రోహిత్‌ శర్మ 106 పరుగుల యావరేజితో 319 పరుగుల చేశాడు. రోహిత్‌ గనుక ఈ వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ కొనసాగిస్తే 800 పైగా పరుగులు చేయనున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 22, 2019, 12:49 [IST]
Other articles published on Jun 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X