న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షై హోప్‌ హాఫ్ సెంచరీ.. విండీస్ స్కోర్ 220/3

ICC Cricket World Cup 2019, West Indies vs Bangladesh: Shai Hope, Shimron Hetmyer up the ante, Earlier Nicholas Pooran fell for 25

ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా టాంటన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ హాఫ్ సెంచరీ చేసాడు. మెహిదీ వేసిన 28వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. దీంతో విండీస్ కోలుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్ మష్రాఫే మోర్తాజ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో విండీస్ బ్యాటింగ్ కు దిగింది. వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గేల్ 13 బంతులాడి సింగిల్ కూడా తీయకుండానే పెవిలియన్ చేరాడు. సైఫుద్దిన్ వేసిన నాలుగో ఓవర్‌లో క్రిస్ గేల్ వికెట్ కీపర్ రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ సమయంలో ఎవిన్ లూయిస్ (70) షై హోప్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. లూయిస్ హాఫ్ సెంచరీ అనంతరం ఔట్ అయినా.. పూరన్‌ (25)తో కలిసి షై హోప్‌ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హోప్‌ హాఫ్ సెంచరీ చేసాడు. పూరన్‌ నిష్క్రమించినా.. హాఫ్, హెట్‌మయిర్‌లు ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. క్రీజులో షెయ్ హోప్ (78), హెట్‌మయిర్‌ (32) ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ భారీ సిక్సర్ కొట్టాడు. 30వ ఓవర్లో మెహదీ హసన్ వేసిన రెండో బంతిని పూరన్ బలంగా బాదడంతో స్టేడియం పైకప్పుపై పడింది. బంతి బలంగా తాకడంతో మట్టి పెంక పగపగిలింది. దీంతో అక్కడ రంధ్రం ఏర్పడదింది. మరోవైపు బంతి కూడా డ్యామేజ్ కావడంతో అంపైర్లు మరో బంతిని తెప్పించారు.

Story first published: Monday, June 17, 2019, 18:01 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X