న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాసన్ హోల్డర్ రికార్డు సిక్స్: బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 322

ICC Cricket World Cup 2019: The West Indies skipper has just hit the biggest six of the tournament!

హైదరాబాద్: టాంటన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారీ సిక్సు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత షిమ్రన్ హెట్‌మెయిర్ 104 మీటర్ల రికార్డు సిక్సు బాదాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అంతేకాదు 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో ఈ మెగా టోర్నీలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో ఆ తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో తమీమ్ ఇక్బాల్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్... హెట్‌మెయిర్ రికార్డు సిక్సుని అధిగమించాడు. బంగ్లా పేసర్ మోర్తజా వేసిన 43వ ఓవర్‌లో హోల్డర్ 105 మీటర్ల సిక్సు కొట్టి ఈ టోర్నమెంట్‌లోనే అతి పెద్ద సిక్సు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు యువ క్రికెటర్ నికోలస్ పూరన్ బాదిన భారీ సిక్సర్‌కు స్టేడియం పైకప్పు పగిలింది.

30వ ఓవర్లో మెహదీ హసన్ వేసిన రెండో బంతిని కొట్ట‌డంతో స్టేడియం పైకప్పుపై పడింది. బంతి బలంగా తాకడంతో మట్టి పెంక పగలడంతో అక్కడ రంధ్రం ఏర్ప‌డింది. బంతి కూడా దెబ్బ‌తిన‌డంతో అంపైర్లు మరో కొంతబంతిని బౌలర్‌కు అందించారు. షకీబ్ వేసిన 33వ ఓవర్లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్(25) వెనుదిరిగాడు.

బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 322

ఇదిలా ఉంటే, విండిస్ జట్టులో షాయ్ హోప్ 121 బంతుల్లో 96(4 ఫోర్లు, ఒక సిక్స్), ఎవిన్ లూయిస్ 67 బంతుల్లో 70(6 ఫోర్లు, 2 సిక్సులు), హెట్‌మెయిర్ 25 బంతుల్లో 50(4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సైపుద్దీన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... షకీబ్ ఉల్ హాసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో విండీస్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ను క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే మొర్తాజా వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌ అయ్యింది. మొర్తాజా వేసిన తొలి ఓవర్‌ను ఆడేందుకు గేల్ ఇబ్బందిపడినట్లు కనిపించింది. ఆ తర్వాత రెండో ఓవర్‌లో గేల్‌ ఐదు బంతులాడినప్పటికీ కనీసం పరుగు కూడా చేయలేదు.

దాంతో విండీస్‌ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక, సైఫుద్దిన్ వేసిన నాలుగో ఓవర్‌లో క్రిస్ గేల్ వికెట్ కీపర్ రహీమ్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో వెస్టిండిస్ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లూయిస్‌కు జత కలిసిన హోప్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు.

1
43666

వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత నికోలస్‌ పూరన్‌తో జత కలిసిన హోప్ బంగ్లా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. అయితే, నికోలస్ పూరన్‌(25) భారీ షాట్‌ ఆడే క్రమంలో మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక, హోప్-హెట్‌ మెయిర్‌ ఇన్నింగ్స్‌ నడిపించారు.

ఈ క్రమంలో హెట్‌ మెయిర్‌ హాఫ్‌ సెంచరీ అనంతరం ఔట్ కాగా... ఆ తర్వాత పరుగు వ్యవధిలో ఆండ్రీ రసెల్‌(0) డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేసన్‌ హోల్డర్‌ విండీస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక, చివర్లో డారెన్‌ బ్రేవో(19) ఫర్వాలేదనిపించడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.

{headtohead_cricket_8_10}

Story first published: Monday, June 17, 2019, 19:43 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X