న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొదటిసారి హిట్‌ వికెట్‌గా ఔట్ అయింది ఎవరో తెలుసా?

ICC Cricket World Cup 2019: Roy Fredericks hooking Denis Lillee for 6, trotted on his Stumps

వన్డేల్లో చాలా మంది బ్యాట్స్‌మన్‌లు హిట్ వికెట్‌గా వెనుదిరిగారు. కొందరు బంతిని బాదబోయి పరుగులు ఏమీ చేయకుండా వికెట్‌గా ఔట్ కాగా.. మరికొందరు సిక్స్, ఫోర్ బాది కూడా పెవిలియన్ చేరారు. ఈ విధంగా ఔట్ అయిన బ్యాట్స్‌మన్‌ల జాబితా చాలానే ఉన్నా.. మొదటగా హిట్‌ వికెట్‌గా ఔట్ అయింది మాత్రం వెస్టిండీస్‌ ఓపెనర్‌ రాయ్‌ ఫెడ్రిక్స్‌.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఫైన్‌లెగ్‌ మీదుగా హుక్‌ షాట్:

ఫైన్‌లెగ్‌ మీదుగా హుక్‌ షాట్:

లార్డ్స్‌ మైదానం వేదికగా జరిగిన 1975 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఫెడ్రిక్స్‌ హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ డెన్నిస్‌ లిల్లీ వేసిన బౌన్సర్‌ని ఫైన్‌ లెగ్‌ మీదుగా ఫెడ్రిక్స్‌ హుక్‌ షాట్ ఆడాడు. బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడడంతో విండీస్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇంతలోనే ఫెడ్రిక్స్‌ ఔటైనట్లు అంపైర్‌ ప్రకటించాడు. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఫెడ్రిక్స్‌ హిట్‌ వికెట్‌:

ఫెడ్రిక్స్‌ హిట్‌ వికెట్‌:

ఫెడ్రిక్స్‌ సిక్స్‌ కొట్టే క్రమంలో శరీరాన్ని నియంత్రించుకోలేక వికెట్ల మీద పడ్డాడు. దీంతో అంపైర్ అతనిని హిట్‌ వికెట్‌గా ప్రకటించాడు. ఫెడ్రిక్స్‌ నిరాశగా వెనుదిరగక తప్పలేదు. వన్డేల్లో ఇలా ఔటైన తొలి బ్యాట్స్‌మెన్‌ ఫెడ్రిక్సే. వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు 67 మంది బ్యాట్స్‌మెన్‌ హిట్‌ వికెట్‌గా అవుట్ అయ్యారు. అయితే తొలిసారి ఔటైన ఫెడ్రిక్స్‌ మాత్రం చరిత్రలో నిలిచిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఫెడ్రిక్స్‌ 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

తొలి ప్రపంచకప్‌ ఇదే:

తొలి ప్రపంచకప్‌ ఇదే:

ఈ మ్యాచ్‌లో విండీస్ 50 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విండీస్ కెప్టెన్ క్లెయివ్ లాయిడ్ 85 బంతుల్లో 102 పరుగులు చేసాడు. క్లెయివ్ లాయిడ్ జోరుతో విండీస్ 291 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో విండీస్ తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇదే మొదటి ప్రపంచకప్‌ కూడా.

Story first published: Saturday, May 18, 2019, 10:05 [IST]
Other articles published on May 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X