న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్‌ కారణంగా అసహనం పెరుగుతుంది: రోహిత్ శర్మ

ICC Cricket World Cup 2019: Rohit Sharma Reveals How Dhoni Made Him Opener Overnight, Dhawans Toilet Tradition

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌ కారణంగా అసహనం మరింత పెరుగుతుంది అని మరో ఓపెనర్ రోహిత్ శర్మ చెప్పాడు. గౌరవ్ కపూర్ నిర్వహించే 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' షోలో తాజాగా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్‌, రోహిత్ శర్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ధావన్‌లో నచ్చనిది అదే:

ధావన్‌లో నచ్చనిది అదే:

ధావన్‌లో నచ్చని ఒక విషయం గురించి రోహిత్ పంచుకున్నాడు. 'ఇద్దరం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి దిగే ముందు ప్రతిసారీ ధావన్‌ వాష్ రూమ్ వెళ్తున్నా అంటాడు. నేను మాత్రం ఫీల్డర్లు వెళ్లడానికి ఐదు నిమిషాల ముందే మైదానంలోకి వెళ్లిపోవాలనుకుంటా. దీంతో నాకు కొంత చిరాకు వస్తుంది. తొలి బంతిని ఎదుర్కొనేది నేనే కాబట్టి ధావన్‌ కారణంగా నాకు మరింత అసహనం పెరుగుతుంది' అని రోహిత్‌ తెలిపాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభించాలని చెప్పాడు:

ఇన్నింగ్స్‌ ఆరంభించాలని చెప్పాడు:

ఓపెనర్ అవతారం ఎలా ఎత్తాడో కూడా రోహిత్ తెలిపాడు. 'అది 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ. తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ నా దగ్గరి వచ్చి ఇన్నింగ్స్‌ ఆరంభించమని చెప్పాడు. ధోనీ అలా అనగానే ఆశ్చర్యపోయా. ధోనీతో సరే అని నా గదికి వచ్చా. ఇది నాకు ఉపయోగపడుతుందా అని చాలా ఆలోచించా. చివరకు ఏదైనా కానీ.. వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు సంతోషంగా ఉన్నా' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఎంజాయ్ చేస్తున్నాడు:

ఎంజాయ్ చేస్తున్నాడు:

ధావన్ మాట్లాడుతూ... 'నాలాగే రోహిత్ కూడా కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాడు. తన కూతురుతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపకు డైపర్స్, డ్రెస్సులు చేంజ్ చేస్తూ సరదా సమయం గడుపుతున్నాడు' అని తెలిపాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. భారత్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కోహ్లీ తొలిసారి ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Sunday, June 2, 2019, 14:49 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X