బాబర్‌ అజామ్‌ హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్ స్కోర్ 222/3

లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ హాఫ్ సెంచరీ చేసాడు. పేసర్ మోరిస్‌ వేసిన 36 ఓవర్ మొదటి బంతికి సింగిల్‌ తీసి బాబర్‌ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అజామ్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం బాబర్‌ అజామ్‌ ఫోర్లు బాదుతూ ఊపుమీదున్నాడు. అతనికి సోహైల్‌ చక్కటి సహకారం అందిస్తున్నాడు. సఫారీ బౌలర్లను ఈ జోడి సమర్ధవంతగా ఎదుర్కొంటూ 71 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పారు. దీంతో పాక్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (44; 57 బంతుల్లో 6 ఫోర్లు), ఫకార్‌ జమాన్‌ (44; 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) లు మంచి భాగస్వామ్యం అందించారు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ.. సఫారీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడి పెవిలియన్ చేరాడు. తాహిర్‌ బౌలింగ్‌లో జమాన్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా బంతి వికెట్‌ కీపర్‌ వెనకాలే గాల్లోకి లేచింది. ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హషీమ్‌ ఆమ్లా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 81 పరుగుల బాగస్వామ్యంకు తెరపడింది.

ఆ తరుణంలో ఇమాముల్‌ హక్‌కు బాబర్‌ అజామ్‌ జత కలిశాడు. అయితే 21వ ఓవర్‌ రెండో బంతిని ఇమామ్‌ డ్రైవ్‌ చేయగా.. బంతి తాహిర్‌కు పక్కగా వెళ్తుండగా ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 98 పరగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. తాహిర్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. హక్‌-ఫకార్‌ జమాన్‌లు 44 పరుగుల వ్యక్తిగత పరుగులు సాధించిన తర్వాత పెవిలియన్‌ చేరడం గమనార్హం. వీరిద్దరూ ఇమ్రాన్‌ తాహీర్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడం మరో విశేషం.

ఓపెనర్లిద్దరూ వెనుదిరగడంతో బాబర్‌ అజామ్‌, హఫీజ్‌ (20) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ మార్‌క్రమ్‌.. హఫీజ్‌ను ఔట్ చేసాడు. దీంతో పాక్ మూడో వికెట్‌ చేజార్చుకుంది. బాబర్‌కు సోహైల్‌ జతకలవడంతో పాక్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో సోహైల్‌ (40), బాబర్‌ (67)లు ఉన్నారు. పాక్ 41 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, June 23, 2019, 18:21 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X