న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్‌ ఢీ.. 316 పరుగుల తేడాతో గెలిస్తేనే

ICC Cricket World Cup 2019, Pakistan vs Bangladesh Match Preview: Sarfaraz Ahmed and Co face improbable task for entering semi-finals

ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు తలపడనున్నాయి. సాంకేతికంగా సెమీ ఫైనల్‌ రేసులో నిలిచిన పాకిస్థాన్‌.. దాన్ని నిజం చేయాలంటే చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్ అనూహ్య విజయం సాధించాల్సి ఉంటుంది. విజయం అంటే మామూలు విజయం కాదు.. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉండాలి. పాక్ టాస్ నెగ్గి మొదటగా బ్యాటింగ్ చేసి 316 పరుగుల తేడాతో విజయం సాధిస్తే సెమీ ఫైనల్‌ రేసులో ఉంటుంది. ఒకవేళ టాస్‌ నెగ్గకపోతే పాకిస్థాన్‌ ఆశలు గల్లంతైనట్టే. భారీ విజయం సాధ్యం కాకపోయినా.. పాక్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు బంగ్లా ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఒత్తిడిలో పాక్‌:

ఒత్తిడిలో పాక్‌:

భారత్‌ చేతిలో పరాజయం అనంతరం పాక్‌.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అప్ఘానిస్థాన్‌లపైగెలిచింది. టోర్నీ ఆరంభంలో విఫలమయిన పాక్.. చివరలో రాణిస్తోంది. ఓపెనర్లు ఇమాముల్, ఫఖర్‌ జమాన్.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ రాణిస్తున్నారు. హారిస్‌ సొహైల్‌ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ పరుగులు చేస్తే బ్యాటింగ్‌ మరింత బలోపేతం అవుతుంది. స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌, షాదాబ్‌ ఖాన్‌, వహాబ్‌ రియాజ్‌, షాహిన్‌ అఫ్రీదితో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ప్రధాన పేసర్‌ ఆమిర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.

బ్యాటింగ్ బలంగా:

బ్యాటింగ్ బలంగా:

టోర్నీలో పెద్ద జట్లనే వణికించిన బంగ్లాదేశ్ ఫామ్‌లో ఉంది. సౌతాఫ్రికా, అఫ్ఘానిస్థాన్‌, వెస్టిండీస్‌పై చక్కటి విజయాలతో ఊపుమీదున్న బంగ్లాదేశ్‌.. పాకిస్థాన్‌పైనా అదే తీరులో చెలరేగాలని పట్టుదలగా ఉంది. ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మీద ఆ జట్టు ఆధారపడుతోంది. ఈ టోర్నీలో షకీబ్ బంతి, బ్యాటుతో రాణిస్తున్నాడు. అద్భుతంగా రాణిస్తున్న షకీబల్‌కు సౌమ్య సర్కార్‌, లిటన్‌ దాస్‌, సబ్బీర్‌ రహ్మాన్‌, సైఫుద్దీన్‌లు తోడైతే ఈ మ్యాచ్‌లోనూ బంగ్లా గెలుపు సులువే. బౌలింగ్‌లో ముస్తఫిజుర్ రాణిస్తున్నా.. కెప్టెన్ మొర్తజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మొసద్దిక్, మెహదీ, సైఫుద్దీన్ చెలరేగితే పాక్ బ్యాట్స్‌మన్‌కు కష్టాలు తప్పవు. బంగ్లా ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచకప్‌ను ఘనంగా ముగించాలనుకుంటోంది.

Teams (Possible XI):

Teams (Possible XI):

Bangladesh: Tamim Iqbal, Soumya Sarkar, Shakib Al Hasan, Mushfiqur Rahim, Liton Das, Mahmudullah, Mosaddek Hossain, Mehidy Hasan, Mushrafe Mortaza, Rubel Hossain, Mustafizur Rahman.

Pakistan: Fakhar Zaman, Imam-ul-Haq, Babar Azam, Haris Sohail, Mohammad Hafeez, Sarfraz Ahmed, Imad Wasim, Shadab Khan, Wahab Riaz, Shaheen Afridi, Mohammad Amir.

Story first published: Friday, July 5, 2019, 11:17 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X