న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ టీమ్ విశ్లేషణ: ఎంత మేరకు రాణించేనో!

ICC Cricket World Cup 2019: Pakistan Team analysis

హైదరాబాద్: 1975లో తొలి వరల్డ్‌కప్ ఆరంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ జట్టు బౌలింగే ప్రధానాయుధంగా బరిలో దిగుతోంది. అయితే, మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో మాత్రం పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది. ఈ మధ్యకాలంలో భారీ లక్ష్యాలను ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అలవోకగా చేధిస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఇందుకు ఉదాహరణ. వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేలకు గాను మూడు వన్డేల్లో 340కిపైగా పరుగులు చేసింది. ఈ సిరిస్‌ వల్ల ఇంగ్లాండ్ పిచ్‌లు, పరిస్థితులపై ఆ జట్టులోని ఆటగాళ్లకు అవగాహన వచ్చింది. అయితే, ఈ సిరిస్‌ను 4-0తో చేజార్చుకోవడంతో పాకిస్థాన్ బోర్డు సీనియర్ పేసర్లు ఆమిర్, వాహాబ్ రియాజ్‌ను తుది జట్టులో చేర్చింది.

అంతకముందు ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో వీరికి చోటు దక్కకపోవడం విశేషం. 1992 లో చివరిసారిగా రౌండ్‌రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫైనల్లో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

ఇంగ్లిష్ గడ్డపైనే చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పాకిస్థాన్.. అంతకుముందు 2009లో వరల్డ్ టీ20ని కూడా ఇక్కడే గెలిచింది. దీంతో రాబోయే వరల్డ్ కప్‌లో సమిష్టిగా రాణించి రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. టోర్నీలో భాగంగా పాక్ మే31న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.

పాక్ బలాలు

పాక్ బలాలు

ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు ఇమాముల్ హక్, ఫకార్ జమాన్ ఫామ్‌లో ఉండగా.... బాబర్ ఆజమ్, కెప్టెన్ సర్ఫరాజ్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక మిడిలార్డర్‌లో షోయబ్ మాలిక్, హఫీజ్ ఫరవాలేదనిపిస్తున్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో బౌలర్లు విఫలమైన సమయంలో సీనియర్లు ఆమిర్, వాహాబ్ రాణిస్తే పాక్‌కు తిరుగలేదు.

పాక్ బలహీనతలు

పాక్ బలహీనతలు

పాక్ ప్రధాన బలం బౌలింగే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకప్పుడు పాక్ బౌలింగ్ అంటే మనకు ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్ వంటి పేసర్లు గుర్తుకు వచ్చేవారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనలో బౌలర్లు విఫలమవడంతో వెటరన్ పేసర్ ఆమిర్‌ను తిరిగి జట్టులో చేర్చాల్సి వచ్చింది. స్పిన్నర్లు షాదాబ్, ఇమాద్‌ల ఫరవాలేదనిపిస్తున్నారు.

వరల్డ్‌కప్‌లో ఆడనున్న పాకిస్థాన్ జట్టు

వరల్డ్‌కప్‌లో ఆడనున్న పాకిస్థాన్ జట్టు

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, హరీస్ సోహైల్, ఇమాద్ వసీమ్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ హస్నైన్, షాహీన్ అఫ్రీది, వహాబ్ రియాజ్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హసన్ అలీ, ఇమాముల్ హఖ్, మొహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్.

Story first published: Wednesday, May 22, 2019, 19:44 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X