న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. లంక కోసం రంగంలోకి మాజీ కెప్టెన్లు

ICC Cricket World Cup 2019: Mahela Jayavardhane, Kumara Sangakkaras advice will help us in World Cup 2019 says Dimuth Karunaratne

ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో ఎంతటి మేము జట్టుకైనా.. మాజీ క్రికెటర్ల సూచనలు అవసరం. కష్ట సమయాల్లో ఉన్నపుడు మాజీల సూచనలు మ్యాచులను మలుపు తిప్పుతాయి. ప్రస్తుతం శ్రీలంక లాంటి జట్టుకైతే మాజీల అవసరం తప్పనిసరి అయింది. మాజీ కెప్టెన్లు మహేల జయవర్దనె, కుమార సంగక్కర.. స్టార్ ప్లేయర్లు దిల్షాన్, మురళీ, వాస్, కులశేఖర వంటి ఆటగాళ్లు రిటైరయ్యాక శ్రీలంక పరిస్థితి దారుణంగా మారింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇవ్వడం, కొందరు ఆటగాళ్లు సస్పెండ్ కావడం వంటి వాటితో లంక జట్టు పూర్వ వైభవాన్ని కోల్పోయింది. జయవర్ధనే అనంతరం చండిమాల్‌, తిసెరా పెరీరా, లసిత్‌ మలింగ, చమర కపుగెదరాలు జట్టు పగ్గాలు చేపట్టినా.. ఫలితం మాత్రం మారలేదు. ఇక ప్రపంచకప్‌ బాధ్యతలు దిముత్‌ కరునరత్నేకు అప్పగించారు. అయితే కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు మహేల జయవర్దనె, కుమార సంగక్కరలు ముందుకు వచ్చారు. ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసేలా లంక ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు వీళ్లిద్దరూ నడుం బిగించారు.

'గత ప్రపంచకప్‌లలో సంగక్కర, జయవర్దనె చాలా బాగా ఆడాడు. ఇప్పుడు వారు మా కోసం వచ్చి విలువైన సలహాలు ఇచ్చారు. ఇది మాకెంతో తోడ్పాటు అందించే విషయం. వారి సలహాలు మాకు ఉపయోగపడనున్నాయి. ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తాం' అని లంక కెప్టెన్ కరుణరత్నె తెలిపాడు. శనివారం న్యూజిలాండ్‌తో లంక తన తొలి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Saturday, June 1, 2019, 8:21 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X