న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్‌ మన చేతుల్లో ఉండదు.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి

ICC Cricket World Cup 2019 : Virat Kohli Says 'Whoever Handles Pressure Better Will Come Out On Top'
ICC Cricket World Cup 2019, India vs New Zealand: Toss is not in our hands, be prepared for any situation says Virat Kohli

టాస్‌ మన చేతుల్లో ఉండదు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్‌ మన చేతుల్లో ఉండదు:

టాస్‌ మన చేతుల్లో ఉండదు:

కోహ్లీ మాట్లాడుతూ...'టాస్‌ మన చేతుల్లో ఉండదు. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. అసలు టాస్‌ను పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మేము అలాగే ఆడుతున్నాం. టాస్ ఓడిపోయినంత మాత్రాన వెనుకపడినట్లు కాదు.. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఒత్తిడి సహజం:

ఒత్తిడి సహజం:

'పిచ్‌తో సంబంధం లేకుండా అప్పటి పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించేటపుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో తప్పులు చేస్తే.. మ్యాచ్‌ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మళ్లీ మనం పుంజుకోవాలంటే కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడుతా. అయితే ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో ఒత్తిడి మరింత ఉంటుంది.. అలాగే తప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువే' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 అక్కడే ఆడాలనేమీ లేదు:

అక్కడే ఆడాలనేమీ లేదు:

'నేను భారీ స్కోర్లు సాధించలేదనే బెంగ లేదు. ప్రపంచకప్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నా. మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇన్నింగ్స్ మొదటలో మంచి ఆరంభం ఇస్తే.. తర్వాత పాండ్యా, పంత్, ధోనీ భారీ షాట్లతో చెలరేగిపోతారు. భారీ ఆరంభం లభించినప్పుడు మూడో స్థానంలో వేరేవారిని పంపిస్తాను. అక్కడ నేనే ఆడాలనేమీ లేదు. పరిస్థితిని బట్టి మార్పులు అవసరం. దాని వల్లే మ్యాచ్‌లు గెలుస్తున్నాం' అని కోహ్లీ తెలిపాడు.

ఆ ఇద్దరే కీలకం:

ఆ ఇద్దరే కీలకం:

ఈ ప్రపంచకప్‌లో ఓపెనర్ రోహిత్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అతను మరో రెండు సెంచరీలు కూడా సాధిస్తాడని అనుకుంటున్నా. ఇక న్యూజిలాండ్‌ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లతో పాటు రాస్‌ టేలర్‌ కీలక ఆటగాళ్లు. ఇద్దరినీ తొందరగా పెవిలియన్‌కు పంపి కివీస్‌పై ఒత్తిడి తీసుకొస్తాం' అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, July 9, 2019, 11:40 [IST]
Other articles published on Jul 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X