న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్: సరికొత్త పాత్‌లో సక్సెస్ అవుతుడా?

ICC Cricket World Cup 2019 : KL Rahul, Looking To Open A Fresh Path || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, India vs New Zealand: KL Rahul looking to open a fresh path with World Cup

దక్షిణాఫ్రికాపై, ఆస్ట్రేలియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ గురువారం మరో కీలక మ్యాచ్‌కు రెడీ అయింది. మూడు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను భారత్‌ ఢీ కొననుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో సత్తా చాటిన భారత్.. కివీస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సన్నద్ధమైంది. ఇక వామప్ మ్యాచ్‌లో ఓటమికి పగ తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.

ఓపెనర్‌గా రాహుల్:

ఓపెనర్‌గా రాహుల్:

గాయం కారణంగా స్టార్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌కు దూరమవడం జట్టుకు అసలైన సవాల్‌గా మారింది. ధావన్ దూరమవడంతో నాలుగో స్థానంలో కుదురుకున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రానున్నాడు. అతను 'హిట్ మ్యాన్' రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. ఓపెనర్‌ పాత్ర రాహుల్‌కు కొత్త కాదు. వాస్తవానికి ప్రపంచకప్‌కు ఎంపిక చేసినప్పుడు కూడా సెలక్టర్లు మూడో ఓపెనర్‌గానే చూశారు.

రాహుల్‌కు సవాలే:

రాహుల్‌కు సవాలే:

ఓపెనర్‌గా రాహుల్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్‌లో అతని ఏకైక సెంచరీ ఓపెనర్‌గానే సాధించాడు. అయితే కీలకమైన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అతను రోహిత్‌తో కలిసి ఎలాంటి ఆరంభం ఇస్తాడనేది చూడాలి. హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్, నీషమ్‌లతో కూడిన పటిష్ఠమైన పేస్ అటాక్ కలిగిన కివీస్‌ను ఎదుర్కోవాలంటే రాహుల్‌కు సవాలే. తొలి పది ఓవర్లు పిచ్ స్వింగ్‌కు సహకరించే అవకాశం ఉండడంతో ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ బంతిని ఇరువైపులా స్వింగ్‌ చేసే అతడిని ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆచితూచి ఆడాల్సిందే.

 నాలుగో స్థానంలో ఎవరు:

నాలుగో స్థానంలో ఎవరు:

ఓపెనర్‌గా రాహుల్ ఖాయమైపోవడంతో రాహుల్‌కు బదులుగా మిడిలార్డర్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే బుధవారం నెట్స్‌లో విజయ్‌ శంకర్‌ ఎక్కువసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. సీనియర్ దినేశ్‌ కార్తీక్‌ను కూడా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ అవసారం కాబట్టి కార్తీక్‌ను ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి కెప్టెన్ కోహ్లీ ఎవరికి ఓటేస్తాడో చూడాలి.

1
43661

{headtohead_cricket_3_4}

Story first published: Thursday, June 13, 2019, 11:21 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X