న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో అసలైన సమరం.. ఆస్ట్రేలియాతో భారత్‌ 'ఢీ'

ICC Cricket World Cup 2019, India vs Australia: Key player battles to watch, Playing 11, Venue, Prediction,Preview, India eye second win

దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్‌.. ఆదివారం తన రెండో మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఢీకొంటోంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియాలు ఫేవరెట్‌ జట్లుగా బరిలోకి దిగాయి. వీటిలో ఒకటి టోర్నీ ఆరంభ దశలోనే కోహ్లీసేనకు ఎదురవుతోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే భారత్‌కు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం.. సెమీస్‌కు దారులు కూడా సుగమనం అవ్వనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అఫ్గానిస్తాన్‌ను అలవోకగా ఓడించి, విండీస్‌పై అనూహ్య విజయం సాధించింది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికాపై విజయంతో ఉత్సహంతో ఉంది టీమిండియా. బలాబలాల్లో సమానంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇక అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ధావన్ జోరందుకుంటే:

ధావన్ జోరందుకుంటే:

ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు భారత్‌కు ఓపెనర్ల ఫామ్‌పై కొంత ఆందోళన నెలకొంది. దక్షిణాఫ్రికాపై శిఖర్‌ ధావన్‌ విఫలమయినా.. 'హిట్ మ్యాన్' రోహిత్‌ శర్మ సెంచరీ బాదడంతో టచ్‌లోకి వచ్చాడు. అయితే శిఖర్‌ ధావన్‌ ఐసీసీ టోర్నీలలో మెరుగ్గా రాణించగలడనే ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో అతడు జోరందుకునే అవకాశం ఉంది. అనంతరం కెప్టెన్‌ కోహ్లీ జట్టును ఆదుకునేందుకు ఉన్నాడు. కేఎల్‌ రాహుల్, ఎంఎస్ ధోనీ, కేదార్‌ జాదవ్‌లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. చివరలో భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు హార్దిక్‌ పాండ్యా ఉన్నాడు.

షమీ వస్తున్నాడా:

షమీ వస్తున్నాడా:

స్పిన్‌ ఆడటంలో దక్షిణాఫ్రికా తడబడుతుందని ఇద్దరు స్పిన్నర్లను తొలి మ్యాచ్‌కు ఎంపిక చేశారు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న మహ్మద్‌ షమీకి అవకాశం దక్కలేదు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్పిన్‌ ఆడటంలో దిట్ట. ఓవల్‌ పిచ్‌ పేసర్లకే ఎక్కువ అనుకూలం కాబట్టి.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ఒక స్పిన్నర్‌ ఉండే అవకాశముంది. బుమ్రా, భువీ, షమీ ముగ్గురు ఆడే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురూ ఉంటే పేస్‌ మరింత పదునెక్కనుంది. బుమ్రాపైనే భారత్ ఆశలు.

ఫామ్‌లో వార్నర్‌, స్మిత్‌:

ఫామ్‌లో వార్నర్‌, స్మిత్‌:

గత సంవత్సరం కాలంగా ఆస్ట్రేలియాకు బ్యాటింగ్‌ పెద్ద సమస్యగా ఉండేది. నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన వార్నర్‌, స్మిత్‌ల రాకతో ఇపుడు ఆ విభాగం పటిష్టంగా మారింది. వార్నర్, స్మిత్‌ అర్ధ సెంచరీలతో ఫామ్‌ చాటుకున్నారు. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్, ఖాజాలు కూడా రాణించారు. మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్, క్యారీ, కూల్టర్‌ నైల్‌లతో లోతైన బ్యాటింగ్ ఉంది. అయితే కరీబియన్‌ పేసర్ల ధాటికి వీరు నిలవలేకపోయారు. టీమిండియా పేసర్లు దీనిని ఉపయోగించుకుంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేయొచ్చు. ఆరంభంలో వార్నర్‌.. చివర్లో మ్యాక్స్‌వెల్‌ చెలరేగిపోకుండా చూసుకుంటే సగం విజయం సాధించొచ్చు.

బ్యాట్స్‌మెన్‌కు సవాలే:

బ్యాట్స్‌మెన్‌కు సవాలే:

ఆసీస్ బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. స్టార్క్‌, కమిన్స్‌ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. వేగం, కచ్చితత్వం, వైవిధ్యంలో వీరికి తిరుగులేదు. ప్రపంచకప్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటారు. ఓవల్‌ పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఈ జోడీని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలే. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌, లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాలపై కూడా భారత బ్యాట్స్‌మెన్‌ ఓ కన్నేసి ఉంచాలి.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 136 వన్డేలు జరగ్గా.. భారత్‌ 49, ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్‌ మూడింట్లో, ఆసీస్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపుపొందింది. చివరగా ఇరుజట్లు 2015 ప్రపంచకప్‌ సెమిస్లో తలపడగా.. ఆసిస్ గెలిచింది. చివరి ఐదు వన్డేల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్‌ తన చివరి 5 వన్డేల్లో రెండే గెలిచింది.

పిచ్, వాతావరణం:

పిచ్, వాతావరణం:

ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో స్కోర్లు 300 దాటాయి. ఈ రోజటి మ్యాచ్‌కు ఫ్లాట్‌ పిచ్‌ ఎదురుకానుంది. గాలులు వీస్తున్నప్పటికీ వాతావరణం పొడిగా ఉండనుంది. వర్షానికి అవకాశం లేదు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగే ఎంచుకునే అవకాశముంది. మధ్యాహ్నం గం.3 నుంచి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవనుంది.

భారత్‌:

భారత్‌:

రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, కేదార్‌ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్/ మొహమ్మద్ షమీ, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జఫ్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా:

ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, ఉస్మాన్‌ ఖాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, నాథన్ కూల్టర్‌ నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్‌ జంపా.

Story first published: Sunday, June 9, 2019, 11:09 [IST]
Other articles published on Jun 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X