న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌పై విజయం.. టీమిండియాపై ప్రశంసల వర్షం

ICC Cricket World Cup 2019, India vs Australia: India won by 36 runs, Twitter hails Team India after emphatic win over Australia

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్‌ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్‌ చెరో 3 వికెట్లు తీశారు. అన్ని విభాగాల్లో రాణించి పటిష్ట ఆసీస్‌పై విజయం విజయం సాధించడంతో సామాజిక మాధ్యమాల్లో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరోవైపు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప పరిణతి చూపించాడని దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచాడని కొనియాడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ డారెన్ లీమ‌న్‌.. మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆకాశ్ చోప్రా త‌ద‌త‌రులు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో విరాట్‌ను అభినందిస్తూ నెటిజన్లు పోస్ట్‌లు, ట్వీట్లను పెడుతున్నారు

వీరేంద్ర సెహ్వాగ్‌:

టీమిండియాకు శుభాకాంక్షలు. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. మ్యాచ్‌ మొత్తం మీద టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. కోహ్లీ సేనకిది సూపర్‌ విజయం.

రవిచంద్రన్ అశ్విన్‌:

ఇది టీమిండియాకు మంచి విజయం. టీమిండియా తన సత్తా ఏంటో చూపింది. బ్యాట్స్‌మెన్‌ అందరూ బాగా ఆడారు. పాండ్యా, కోహ్లీ, బుమ్రా, శిఖర్ సూపర్.

సానియా మీర్జా:

ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది. ఈ రోజు ఆలస్యంగా నిద్రపోయాను. నా కుమారుడిని నిద్రపుచ్చి నేను టీమిండియా మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేశాను. ఒకవైపు నాదల్‌ విజయం.. మరోవైపు టీమిండియా విజయం.

హర్భజన్‌ సింగ్‌:

టీమిండియా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. ఇది అద్భుత విజయం. బుమ్రా, చాహల్‌, భువి నుంచి అద్భుతమైన ఎదురుదాడి. పాండ్య బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

ప్రీతి జింటా:

టీమిండియా గొప్ప విజయం సాధించింది. టీమిండియాకు పవర్‌ ప్యాక్‌డ్‌ ఇన్నింగ్స్‌. బౌలర్స్‌, బ్యాట్స్‌మెన్‌ రాణించారు. ఈ సండే నాకు ఫన్‌డేలా గడిచింది. నేను చాలా ఎంజాయ్ చేశా. భువీ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. టీమిండియాకు శుభాకాంక్షలు.

Story first published: Monday, June 10, 2019, 16:14 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X