న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ సిక్స‌ర్‌.. కోహ్లీ ఆశ్చర్యం (వీడియో)

ICC Cricket World Cup 2019 : MS Dhoni Hits Huge SIX,Virat Kohli's Reaction Goes Viral || Oneindia
ICC Cricket World Cup 2019, India vs Australia: Captain Virat Kohlis Brilliant Reaction To MS Dhonis Huge Six Off Bowler Mitchell Starc

ఆస్ట్రేల‌యా పేసర్ మిచెల్ స్టార్క్‌ ప్రస్తుత టాప్ బౌలర్లలో ఒకడు. కచ్చితమైన వేగం, వైవిధ్య బంతులతో మేటి బ్యాట్స్‌మన్‌కు కూడా చుక్కలు చూపించగలడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్టేలియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అలాంటి స్టార్ బౌలర్ బౌలింగ్‌లో మాజీ టీంఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారీ సిక్స్ బాది ఔరా అనిపించాడు. ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ భారీ సిక్స్ కొట్టాడు. స్టార్క్ వేసిన 49వ ఓవ‌ర్ తొలి బంతిని ధోనీ సిక్స‌ర్ కొట్టాడు. 143 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన బంతిని.. ధోనీ త‌న మార్క్ షాట్‌తో స్క్వేర్‌ లెగ్‌ వైపు స్టాండ్స్‌లోకి పంపాడు. నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ షాట్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ధోనీ దగ్గరికొచ్చి మరీ గట్టిగా నవ్వాడు. ధోనీ షాట్‌ అభిమానుల్ని సైతం ఆకట్టుకుంది. ఆ సిక్స్ 87 మీటర్లు వెళ్ళింది.

ధోనీ కొట్టిన సిక్సుకు సంబందించిన వీడియోను ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. 'ఏం షాట్‌ కొట్టావ్‌', ' ధోనీ కమాల్', ధోనీ ఆ మజాకా' అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఓ లుక్కేయండి. అయితే సిక్స్ కొట్టిన అనంతరం భారీ షాట్ ప్రయత్నించి ధోనీ పెవిలియన్ చేరాడు. ధోనీ 27 (14 బంతుల్లో 3×4, 1×6) పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ధోనీతో పాటు స్టార్క్‌కు మ‌న బ్యాట్స్‌మన్‌ అందరూ చుక్క‌లు చూపించారు. కోహ్లీ కూడా స్టార్క్ బౌలింగ్ ఓ సూపర్ సిక్స‌ర్ కొట్టాడు. ఎక్స్‌ట్రా క‌వ‌ర్ మీదుగా కోహ్లీ సిక్స‌ర్ బాదాడు. మ్యాచ్‌లో స్టార్క్ తన కోటా 10 ఓవ‌ర్ల‌లో 74 పరుగులు ఇచ్చాడు. ఇన్ని పరుగులు ఇచ్చాడంటే అతని బౌలింగ్‌ను మనోళ్లు ఎలా ఆడుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్ 36 ప‌రుగుల తేడాతో గెలిచింది.

Story first published: Monday, June 10, 2019, 14:15 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X