న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

ICC Cricket World Cup 2019 : India Won By 36 Runs On Australia At Oval | Match Highlights
 India crush Australia by 36 runs at Oval

హైదరాబాద్: వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 353 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 316 పరుగులకే పరిమితమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజయం. లక్ష్య చేధనలో ఓపెనర్లు ధాటిగా ఆడినా మిడిలార్డర్ మాత్రం భారత బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో స్మిత్‌ 70 బంతుల్లో 69(5 ఫోర్లు, సిక్స్), డేవిడ్ వార్నర్‌ 84బంతుల్లో 56(5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.

ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభణతో వరుసగా వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. చివర్లో అలెక్స్ కారే 35బంతుల్లో 55(5 ఫోర్లు, సిక్స్)తో పోరాడినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా... యజువేంద్ర చాహల్‌ రెండు వికెట్లు తీశాడు.


352 పరుగులు చేసిన భారత్
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. తొలి ఏడు ఓవర్ల నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు... ఆ తర్వాత ధావన్‌ పరుగుల వరద పారించాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన ఎనిమిదో ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఓవర్లు ధావన్‌ 14 పరుగులు పిండుకున్నాడు.

ఆ తర్వాత నిలకడగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరొవైపు రోహిత్‌ శర్మ అతడికి సహకారం అందిస్తు హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోడీ 127 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రోహిత్‌ శర్మ(57) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లితో కలిసిన ధావన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

1
43657

ఆసీస్‌ బౌలింగ్‌‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని ధావన్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో ధావన్‌కు ఇది 16వ వన్డే సెంచరీ. ఆ తర్వాత జట్టు స్కోరు 220 పరుగుల వద్ద శిఖర్ ధావన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా చెలరేగి ఆడాడు. అయితే హాఫ్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో హార్దిక్‌ పాండ్యా మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ధోని 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 27 పరుగులు సాధించి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆఖరి ఓవర్‌లో స్కోరును పెంచే క్రమంలో కోహ్లీ(82) పరుగుల వద్ద ఔట్‌ కాగా, కేఎల్‌ రాహుల్‌ 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ కొట్టడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో స్టోయినిస్‌ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, స్టార్క్‌, కౌల్టర్‌ నైల్‌లకు తలో వికెట్‌ లభించింది.

{headtohead_cricket_1_3}

Story first published: Sunday, June 9, 2019, 23:45 [IST]
Other articles published on Jun 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X