
తాను ఆడిన తొలి బంతికే
అయితే, ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతికే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశపరిచాడు. టీమ్ మీటింగ్స్‌లో సైతం తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని ఈ మెగా టోర్నీలో తనలోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీయాలని పలుమార్లు చెప్పినట్లు సమాచారం. అయితే, అందుకు భిన్నంగా అతడి ప్రదర్శన ఉండటం విశేషం.

287 వన్డేలాడిన 7534 పరుగులు చేసిన మాలిక్
పాక్ తరుపున ఇప్పటివరకు 287 వన్డేలాడిన షోయబ్ మాలిక్ 7534 పరుగులు చేశాడు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరేంగేట్రం చేసిన ఇప్పటికీ క్రికెట్ ఆడుతోన్న ఇద్దరు క్రికెటర్లలో షోయబ్ మాలిక్ ఒకడు. మొదటి క్రికెటర్ వెస్టిండిస్‌కు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవడంలో కూడా మాలిక్ ఘనత సాధించాడు.

2011, 2015 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని మాలిక్
2007, మార్చి 21న జింబాబ్వేతో తన చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడిన షోయబ్ మాలిక్ తిరిగి 12 ఏళ్ల 74 రోజుల తర్వాత ఈ మెగా టోర్నీలో మ్యాచ్ ఆడాడు. 2011, 2015 వరల్డ్‌కప్ జట్టులో షోయబ్ మాలిక్ చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ షోయబ్ మాలిక్‌కు ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు.

ఈ వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్
మాలిక్ సైతం ఈ వరల్డ్‌కప్ తర్వాత తాను పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశంగా సెలక్టర్లు ఈ వరల్డ్‌కప్‌లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో అత్యధిక విరామం తీసుకున్న రెండో ఆటగాడిగా షోయబ్ మాలిక్ అరుదైన గుర్తింపు పొందాడు. వెస్టిండిస్‌కు చెందిన ఆండర్సన్ కమిన్స్ 14 ఏళ్ల 362 రోజుల తర్వాత మ్యాచ్ ఆడాడు.

భారత్‌తో ఆడిందే షోయబ్ మాలిక్ చివరి అంతర్జాతీయ మ్యాచ్!
ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ మీద దృష్టిపెట్టకుండా తన భార్య సానియా మిర్జాతో కలిసి రెస్టారెంటుకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ మెగా టోర్నీలో అతను మరో మ్యాచ్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. భారత్‌తో ఆడిందే మాలిక్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












