న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అత్యుత్తమ 10 జట్ల మధ్య పోటీ.. కప్ గెలవడం కష్టమే'

ICC Cricket World Cup 2019 : Eoin Morgan Feels World Cup Is Going To Be Extraordinarily Competitive
ICC Cricket World Cup 2019: Eoin Morgan feels ten-nation event is going to be extraordinarily competitive

ప్రపంచంలోనే అత్యుత్తమ 10 జట్ల మధ్య పోటీ జరగనుంది. ఈ పోటీలో ప్రపంచకప్‌ గెలవడం అంత సులువు కాదు అని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ ఈ నెల 30న ప్రారంభమవనున్న నేపథ్యంలో గురువారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కెప్టెన్ల అధికారిక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొని మాట్లాడారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాం:

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ మాట్లాడుతూ... 'ప్రపంచంలోనే అత్యుత్తమ 10 జట్ల మధ్య టోర్నీ జరగనుంది. అసాధారణ పోటీ, అద్భుతమైన ఆటకు ఇది వేదిక. నాణ్యమైన క్రికెట్‌తో ఈ ప్రపంచకప్‌ సాగుతుంది. మా జట్టు బాగా సన్నద్దమయ్యాం. గతంలో ఇక్కడ భారీ స్కోర్లు చేసాం. ఆ ఆత్మవిశ్వాశంతో బరిలోకి దిగుతున్నాం. కప్ సాదించేందుకు ప్రయత్నిస్తాం. తొలి మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అని తెలిపారు.

ఇంగ్లాండ్ జట్టే ఫెవరేట్:

ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ మాట్లాడుతూ... ఇంగ్లాండ్ గత రెండేళ్లుగా బాగా రాణిస్తోంది. భారీ స్కోర్లు కూడా ఛేదిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఆ జట్టే ఫెవరేట్. వార్నర్, స్మిత్‌ రాకతో మా జట్టు పటిష్టంగా మారింది. ఇద్దరు పరుగులు చేస్తూ అండగా ఉంటారు. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ మాకు కీలకమైంది. జట్టుకో విధంగా ప్రణాళికలను అమలు పరుస్తాం' అని ఫించ్‌ చెప్పారు.

తొలి కెప్టెన్‌గా నిలవాలనుకుంటున్నా:

తొలి కెప్టెన్‌గా నిలవాలనుకుంటున్నా:

దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. వారందరూ రాణిస్తారనే నమ్మకం ఉంది. బౌలర్లే బలం. గతంలో ఇక్కడ ఆడిన అనుభవం పనికొస్తుంది. ప్రపంచకప్‌ గెలిపించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా నిలవాలనుకుంటున్నా' అని అన్నారు.

ప్రపంచకప్‌ సాధిస్తాం:

ప్రపంచకప్‌ సాధిస్తాం:

పాకిస్థాన్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ... 'జట్టు మంచి సమతూకంతో ఉంది. సీనియర్లు రాణిస్తారనే నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ అచ్చొచ్చే వేదిక. 1992 ప్రపంచకప్‌ గెలిచాక.. ఇంగ్లండ్‌లో జరిగిన 1999 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచాం. రెండేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీ కూడా సాధించాం. కాబట్టి ఈ ప్రపంచకప్‌నూ సాధిస్తాం' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Story first published: Friday, May 24, 2019, 10:55 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X