ఇంగ్లండ్‌తో శ్రీలంక పోరు.. లంకకు చావోరేవో

ICC Cricket World Cup 2019 : England vs Sri Lanka, Match Preview ! || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, England vs Sri Lanka Match Preview: Leeds Weather Updates, Probable XI, Headingley Pitch Report and Records

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమే లేని ఇంగ్లండ్‌ మరో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరువకావాలనిచూస్తోంది. ఇంగ్లండ్‌ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవగా.. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దు అయింది. మరోవైపు లంక జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. రెండింటిలో ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో లంక 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. సెమీస్‌ చేరాలంటే లంక తమ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లంకకు చావోరేవో.

1
43670

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌:

అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌:

ఈ ప్రపంచకప్‌లో మిగతా జట్లతో పోల్చితే ఇంగ్లండ్‌కు అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఇంగ్లండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 300+ స్కోర్లు సాధించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ దూరమైనా.. మరో ఓపెనర్ బెయిర్‌స్టో ఫామ్ అందుకున్నాడు. జో రూట్‌, కెప్టెన్‌ మోర్గాన్‌లు సెంచరీలతో చెలరేగుతున్నారు. బట్లర్, స్టోక్స్, అలీ లాంటి భారీ హిట్టర్లు కూడా ఉన్నారు. వీరిని లంక బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి. ఈ టోర్నీలో 12 సెంచరీలు నమోదు కాగా.. అందులో 5 శతకాలు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ కొట్టారు. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ టాపార్డర్‌ చెలరేగితే లంక బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమే. ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా ఫామ్‌లో ఉన్నారు. పేసర్లు ఆర్చర్, వుడ్‌లను తట్టుకుని క్రీజులో నిలవడం లంక బ్యాట్స్‌మన్‌కు సవాలే.

బ్యాటింగ్‌ వైఫల్యం:

బ్యాటింగ్‌ వైఫల్యం:

బ్యాటింగ్‌ వైఫల్యం లంకను వేధిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 136 రన్స్‌కే కుప్పకూలింది. అఫ్ఘానిస్థాన్‌పై 201, ఆస్ట్రేలియాపై 247 స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు కరుణ రత్నె, కుశాల్‌ పెరీరా మినహా మిగతా వారు పరుగులు చేయడం లేదు. కుశాల్‌ మెండిస్, మాథ్యూస్, తిసారా పెరీరా పూర్తిగా విఫలమవుతున్నారు. కీలక మ్యాచ్ కాబట్టి అందరూ రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో లసిత్‌ మలింగ, నువాన్‌ ప్రదీప్‌, ఇసురు ఉదాన, ధనంజయ డిసిల్వా లపై లంక నమ్మకం పెట్టుకుంది. ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఆదుకోవడం కష్టమే.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

ఇరు జట్లు ఇప్పటివరకు 74 మ్యాచ్‌ల్లో తలపడగా.. లంక 35 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంగ్లండ్‌ 36 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ టై కాగా.. రెండింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లలో పోటీపడితే.. నాలుగింట్లో లంక, ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి. లీడ్స్‌ వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ మైదానంలో మొదటి ప్రపంచకప్ మ్యాచ్. ఈ రోజు వర్షం పడే అవకాశాలు తక్కువ. ఈ వేదికపై ఇంగ్లాండ్ చివరి ఆరు వన్డేలను గెలుచుకుంది. భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది.

Teams (Probable XI):

Teams (Probable XI):

England: James Vince, Jonny Bairstow, Joe Root, Eoin Morgan, Ben Stokes, Jos Buttler, Chris Woakes, Mark Wood, Jofra Archer, Moeen Ali, Adil Rashid.

Sri Lanka: Dimuth Karunaratne, Kusal Perera, Avishka Fernando, Kusal Mendis, Angelo Mathews, Dhananjaya de Silva, Thisara Perera, Milinda Siriwardana, Isuru Udana, Lasith Malinga, Nuwan Pradeep.

1
7
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 21, 2019, 9:43 [IST]
Other articles published on Jun 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more