న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘనిస్థాన్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ICC Cricket World Cup 2019, England vs Afghanistan LIve Score: England opted to bat first in Manchester

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళావరం ఇంగ్లాండ్-ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ రెండు మార్పులు చేయగా... ఆప్ఘనిస్థాన్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఇంగ్లీష్‌ జట్టు తహతహలాడుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సంచలనం సృష్టించాలని ఆప్ఘనిస్థాన్‌ పట్టుదలగా ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించిన ఇంగ్లాండ్.. రెండో మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడింది. ఆ తర్వాత పుంజుకొని.. బంగ్లాపై 106 పరుగులు, విండిస్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాలను నమోదు చేసింది.

దీంతో ఈ టోర్నీలో మూడు విజయాలను ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా... ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో కనీస పోటీ ఇవ్వలేక చతికిలబడింది.

1
43667

ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ అత్యద్భుత ప్రదర్శన చేస్తే తప్ప ఇంగ్లాండ్‌ను నిలువరించడం కష్టం. మరోవైపు ఇంగ్లాండ్ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా జో రూట్‌ రెండు సెంచరీలు సాధించి జోరు మీదున్నాడు. రూట్‌కు తోడుగా బట్లర్, బెయిర్‌స్టో, స్టోక్స్‌ చెలరేగితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మరోసారి 300 మైలురాయిని దాటే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
ఆప్ఘనిస్థాన్:రహ్మత్‌ షా, నూర్‌ అలీ జడ్రాన్‌, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, మహ్మద్‌ నబీ, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌, రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, దావ్లత్‌ జాద్రన్‌

ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, ఇయాన్‌మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, అదిల్‌ రషీద్‌, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌ వుడ్‌

{headtohead_cricket_2_95}

Story first published: Tuesday, June 18, 2019, 15:02 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X