న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోర్గాన్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన అఫ్గానిస్థాన్‌

ICC Cricket World Cup 2019 : England Defeat Afghanistan By 150 Runs At Cricket World Cup || Oneindia
ICC Cricket World Cup 2019, England vs Afghanistan: Captain Eoin Morgan smashes 17 sixes in masterly, England beat Afghanistan by 150 runs

ఆతిథ్య ఇంగ్లండ్‌ దెబ్బకి పసికూన అఫ్గానిస్తాన్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో అఫ్గానిస్థాతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 247 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలమైన ఇంగ్లండ్‌ జట్టు అఫ్గాన్‌ను ఓ ఆటాడుకుంది. ఇంగ్లండ్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుని ఆగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో ఓటమి చవిచూసిన అఫ్గాన్‌ టోర్నీ నుండి నిష్క్రమించింది.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఓపెనర్ నూర్ అలీ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రహ్మత్ షా (74 బంతుల్లో 46 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్), గుల్బదీన్ నయీబ్‌ (28 బంతుల్లో 37 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్)లు ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. నయీబ్‌ ఔట్ అయినా రహ్మత్.. హష్మతుల్లా షాహిది (100 బంతుల్లో 76 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. ఈ జోడి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించారు.

హస్మతుల్లా ఒంటరి పోరాటం:

హస్మతుల్లా ఒంటరి పోరాటం:

రహ్మత్ ఔట్ అయిన తర్వాత అస్ఘర్‌ అఫ్ఘాన్‌ (44), హస్మతుల్లాలు 20 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ ఆదిల్‌ రషీద్‌ తన వరుస ఓవర్లలో అస్ఘర్‌, నబీ (9)లను పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఒంటరి పోరాటం చేస్తున్న హస్మతుల్లాను 46వ ఓవర్‌లో ఆర్చర్‌ అవుట్‌ చేయడంతో అఫ్గాన్‌ ఓటమి లాంఛనమే అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌లు చెరో 3 వికెట్లు తీసారు.

బాదుడే లక్ష్యంగా:

బాదుడే లక్ష్యంగా:

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు విన్స్‌ (26), బెయిర్‌ స్టో తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అనంతరం బెయిర్‌స్టో (90; 99 బంతుల్లో 8×4, 3×6), రూట్‌ (88; 82 బంతుల్లో 5×4, 1×6) బ్యాట్‌కు పనిచెప్పారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించింది. ఈ క్రమంలో సెంచరీకి పది పరుగుల దూరంలో బెయిర్‌స్టో అవుటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌ బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బౌలర్‌ ఎవరేనేది చూడకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు.

71 బంతుల్లో 148:

71 బంతుల్లో 148:

36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న మోర్గాన్‌.. ఆ తర్వాత మరో 21 బంతుల్లోనే సెంచరీ (148; 71 బంతుల్లో 4×4, 17×6) చేసాడు. శతకం అనంతరం మరింత మోర్గాన్‌ మరింత చెలరేగాడు. అయితే 47వ ఓవర్లో నైబ్‌.. రూట్, మోర్గాన్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. బెన్‌ స్టోక్స్‌ (2), బట్లర్‌ (2)త్వరగానే పెవిలియన్ చేరినా.. మొయిన్‌ అలీ (31 నాటౌట్‌) సైతం బ్యాట్‌ ఝళిపించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్ చేసింది. ఆఫ్గన్ బౌలర్లలో దావ్లత్ జద్రాన్, గుల్బదీన్ నయీబ్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి. ఇయాన్‌ మోర్గాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Story first published: Wednesday, June 19, 2019, 8:01 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X