న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2019: అన్ని జట్ల పూర్తి జాబితా, కెప్టెన్లు వీరే!

ICC Cricket World Cup 2019 : All Teams Squads For World Cup || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Complete squads of all teams, captains

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. లండన్‌లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌తో ఇంగ్లాండ్ సమ్మర్ ఇంకాస్త వేడెక్కనుంది. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రౌండ్ రాబిన పద్దతిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో ఒక్కో జట్టు టోర్నీలోని మిగతా జట్లతో తలపడనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. జులై 9న జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కి ఓల్డ్ ట్రాఫోర్డ్ ఆతిథ్యమిస్తోంది.

జులై 11న జరిగే రెండో సెమీ పైనల్ మ్యాచ్‌కి ఎడ్జిబాస్టన్ వేదిక కానుంది. ఫైనల్ మ్యాచ్‌కి ముందు రిజర్వ్ డే ఉంది. కాగా, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుందిట్టు. టోర్నీకే హై ఓల్టేజ్ మ్యాచ్‌గా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 16న జరగనుంది.

వరల్డ్‌కప్‌లో ఆడే జట్లివే

టీమిండియా

టీమిండియా

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ స్టాండ్‌బై ఆటగాళ్లుగా అంబటి రాయుడు, రిషబ్ పంత్ ఉన్నారు.

ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా

ఆరోన్ ఫించ్(కెప్టెన్), బెహ్రాన్‌డ్రాఫ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయాన్, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్ సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.

న్యూజిలాండ్

న్యూజిలాండ్

కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్‌హోమ్, లోకీ ఫర్గూసన్, గుప్టిల్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్(వికెట్ కీపర్), కోలిన్ మున్రో, జిమ్మీ నిషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోథీ, టిమ్ సోథీ, రాస్ టేలర్‌.

ఇంగ్లాండ్

ఇంగ్లాండ్

ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ ఆలీ, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), జోస్ బట్లర్, శామ్ కర్రాన్, జో డెన్లీ, అలెక్స్ హేల్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

పాకిస్థాన్

పాకిస్థాన్

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబిద్ అలీ, బాబర్ ఆజాం, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, హరీస్ సోహైల్, షాబాద్ ఖాన్, ఇమాద్ వాసిం, హసన్ అలీ, ఫహీమ్ అష్రప్, షహీన్ షా అఫ్రిది, జునైద్ ఖాన్, మహ్మద్ హన్సన్

దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికా

డుప్లెసిస్(కెప్టెన్), ఐడెన్ మర్క్రమ్, క్వింటన్ డీకాక్ (వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ పెహ్లుక్‌వాయో, జేపీ డుమిని, డేవాయిన్ ప్రోటోరియస్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నార్జే, ఇమ్రాన్ తాహిర్, తబ్రాజ్ షంసీ

శ్రీలంక

శ్రీలంక

కరుణరత్నే(కెప్టెన్), ఏంజెలో మ్యాథుస్, లసిత్ మలింగ, కుశాల్ పెరీరా, లాహిరు తిరుమన్నే, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దనంజయ డి సిల్వా, జెఫెరె వందేసె, త్రిసార పెరెరా, ఇసురు ఉదన, సురంగ లక్మాల్, నువాల్ ప్రదీన్, జీవన్ మెండిస్, మిలింద సిరివర్థన

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్

మొర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిథన్ దాస్, సౌమ్యా సర్కార్, ముషీఫర్ రహీమ్, షకీబ్ ఉల్ హసన్, మహ్మద్ మిథున్, షబ్బీర్ రెహ్మాన్, మొసద్దిక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహెడీ హసన్ మిరాజ్, రూబెల్ హుస్సెన్, ముస్తఫిజుర్ రెహ్మన్, అబు జాయెద్‌

Story first published: Friday, April 19, 2019, 18:51 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X