న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచకప్‌ గెలవాలంటే నిరాశ కాదు సహనం ఉండాలి'

ICC Cricket World Cup 2019 : Rohit Sharma Says Calmness Rather Than Desperation Needed To Lift Title
ICC Cricket World Cup 2019: Calmness Rather Than Desperation Needed to Lift Title says Rohit Sharma

మెగా టోర్నీ ప్రపంచకప్‌ గెలవడం అందరి కల. మరి ప్రపంచకప్‌ గెలవాలంటే నిరాశ కాదు సహనం ఉండాలని టీమిండియా ఓపెనర్, 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ సూచించారు. మెగా టోర్నీ ప్రపంచకప్‌ సమరం ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా బుధవారం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. జట్టు ఆటగాళ్లు అందరూ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు.

న్యూజిలాండ్‌తో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌:

న్యూజిలాండ్‌తో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌:

శనివారం మధ్యాహ్నం ఓవల్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో భారత్‌ తమ తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 28న కార్డిఫ్‌లో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో ప్రపంచకప్‌ సమరం మొదలు పెడుతుంది. టోర్నీలో భారత్ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. తాజాగా రోహిత్ ఓ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

నిరాశ కాదు సహనం ఉండాలి:

నిరాశ కాదు సహనం ఉండాలి:

'ఎదుగుతున్న పిల్లలు ఏదో సమయంలో స్ఫూర్తి చెంది తమకు ఇష్టమైన రంగాల్లోకి వెళుతుంటారు. ఒక క్రికెట్ క్రీడాకారుకి ప్రపంచకప్‌ ఆడాలని, కప్ సాధించాలని ఉంటుంది. నాకు కూడా కప్ సాధించాలనే కల ఉంది. మ్యాచ్‌లో ఎప్పుడూ ఒత్తిడిని దరిచేయనీయకూడదు. ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే అత్యుత్తమ ఆట ఆడదానికి దోహదం చేస్తుంది. విజయం సాధించాలంటే (కప్‌) నిరాశ కాదు సహనం ఉండాలని' అని రోహిత్ పేర్కొన్నారు.

సత్తా చాటడానికి సిద్ధం:

సత్తా చాటడానికి సిద్ధం:

'తన ముంబై జట్టు ఆటగాళ్లు బుమ్రా, పాండ్యాలు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు కూడా ప్రతి మ్యాచ్‌లో రాదేలుతున్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ ముందుంటారు. గత కొన్ని నెలలుగా అద్భుత ఆట ప్రదర్శిస్తున్నారు. పాండ్యా ఐపీఎల్-12లో కొన్ని మంచి ప్రదర్శనలు చేసాడు. టోర్నీలో తన వంతు కృషి చేస్తాడు' అని రోహిత్ అన్నారు.

నెట్స్‌లో ఆడడం ఇబ్బందే:

నెట్స్‌లో ఆడడం ఇబ్బందే:

'బుమ్రా బౌలింగ్‌ను నెట్స్‌లో కూడా ఆడడం ఇబ్బందే. అతని బౌలింగ్‌ని అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. అతను ఓ స్పెషల్. టాప్ ఆర్డర్ లో పరుగులు చేయడం నాకు, ధావన్, కోహ్లీకి ఓ బాధ్యత. ఇదే మా పని. ఈ రోజు నేను ఆడాను.. ఈ రోజు నువ్వు ఆడు అని అనుకోలేం. మా భాద్యతను నిర్వర్తించడమే మాకు తెలుసు. ఈ టోర్నీలో అందరం రాణించాల్సిన అవసరం ఉంది' అని రోహిత్ చెప్పుకొచ్చారు.

Story first published: Friday, May 24, 2019, 15:27 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X