న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ పోరు.. తొలి విజయం ఎవరిది?

ICC Cricket World Cup 2019: Afghanistan vs Sri Lanka: Afghanistan, Sri Lanka Eye First Win After Initial Setbacks


ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా మంగళవారం మాజీ చాంపియన్‌ శ్రీలంక, పసికూన అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గతకొంత కాలంగా రాణిస్తూ క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్తాన్‌.. లంకపై పైచేయి సాధించినా ఆశ్చర్యం లేదు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌.. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా బౌలింగ్ లో కూడా 200పై చిలుకు పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో శ్రీలంక సతమతమవుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం:

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం:

న్యూజీలాండ్ మ్యాచ్‌లో కెప్టెన్‌ కరుణరత్నే మినహా ఎవ్వరూ పరుగులు చేయలేదు. ఎనిమిది మంది బ్యాట్స్‌మన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మాథ్యూస్‌, పెరీరా, తిరిమన్నే, మెండిస్, డిసిల్వాలు రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌లో లంక ఆశలన్నీ సీనియర్‌ పేసర్‌ మలింగపైనే. కానీ అతను కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో లంక పరిస్థితి ఘోరంగా మారింది. మలింగ రాణిస్తే ఆరంభంలో వికెట్లు తీసి అఫ్గానిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌లపై ఒత్తిడి పెంచొచ్చు.

స్పిన్ విభాగం పటిష్టం:

స్పిన్ విభాగం పటిష్టం:

మరోవైపు గుల్బదిన్‌ నైబ్‌ సారథ్యంలోని అఫ్గానిస్తాన్‌.. లంక కంటే కాస్త మెరుగ్గానే ఉంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా డకౌట్‌ కావడంతో అఫ్గానిస్తాన్‌ తడబడింది. ఈ మ్యాచ్‌లో వీరు ఫామ్ కొనసాగిస్తే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. వీరికి తోడు గుల్బదిన్‌, రహ్మత్ షా, హజ్రతుల్లా షాహిదీ, నబీ రాణిస్తే తిరుగుండదు. స్పిన్ విభాగం రషీద్, ముజీబ్, నబీలతో పటిష్టంగా ఉండగా.. పేస్ మాత్రం బలహీనంగా ఉంది. ఇప్పటివరకు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ జట్లు మూడుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, మరో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిచింది.

జట్టు (అంచనా):

జట్టు (అంచనా):

శ్రీలంక:

దిముత్ కరుణరత్నె(కెప్టెన్), లాహిరు తిరుమానె, కుశాల్ పెరీరా (వికెట్ కీపర్), కుశాల్ మెండీస్, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరీరా, జీవన్ మెండీస్, సురంగ లక్మల్, ఇసురు ఉడాన, లసిత్ మలింగ.

ఆప్ఘనిస్తాన్‌:

గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, షహజద్ (వికెట్ కీపర్), దౌలత్‌ జద్రాన్, రహ్మత్‌ షా, నజీబుల్లా జద్రాన్‌ హష్మతుల్లా షాహిది, హమీద్‌ హసన్, రషీద్‌ ఖాన్, ముజీబుర్‌ రహ్మాన్, మొహమ్మద్‌ నబీ.

Story first published: Tuesday, June 4, 2019, 10:48 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X