న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో చెడుగా ప్రవర్తిస్తే బయటికే: అమల్లోకి ఐసీసీ కొత్త రూల్స్

క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. 

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పలు నిబంధనల్లో మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. క్రికెటర్ల మధ్య క్రమశిక్షణ పెంచేందుకే ఐసీసీ ఈ కొత్త రూల్స్‌ని ప్రవేశపెడుతుంది.

మైదానంలో హద్దులు మీరి కొంత మంది ఆటగాళ్లు ప్రత్యర్థి క్రికెటర్లతో గొడవపడటం, అంపైర్ల నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై బెదిరింపులకి దిగడం లాంటి చేష్టలకు గాను ఇప్పటి వరకు క్రమశిక్షణ తప్పిన క్రికెటర్లని మ్యాచ్ ముగిసిన తర్వాత.. మ్యాచ్ రిఫరీ, ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు ఐసీసీ చర్యలు తీసుకునేది.

కానీ.. సెప్టెంబరు 28 నుంచి మైదానంలోని అంపైర్లే అప్పటికప్పుడు ఆటగాళ్లపై చర్యలు తీసుకోనున్నారు. ఫుట్‌బాల్ రూల్స్ తరహాలో హద్దులు మీరిన క్రికెటర్లని ఆట మధ్యలోనే మైదానం నుంచి వెలుపలికి పంపించే అధికారం కూడా అంపైర్లకు తాజాగా ఐసీసీ కల్పించింది.

బ్యాట్, బంతి మధ్య సమతుల్యం పెంచేందుకు బ్యాట్స్‌మెన్స్‌ కూడా తమ బ్యాట్ ఎడ్జ్ మందాన్ని ఐసీసీ కొత్త రూల్స్‌కి తగినట్లుగా మార్చుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను టీ20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత అదనపు రివ్యూలు అమలు చేసే విధానానికి ఐసీసీ స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు విజయవంతం కాని రివ్యూలను ఉపయోగించుకునే వీలు కల్పించింది.

మైదానం నుంచి బయటకు

మైదానం నుంచి బయటకు

మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాడు చెడుగా ప్రవర్తనకు పాల్పడితే లెవెల్ 4 నిబంధనను అమలు చేయనున్నారు. అంటే మైదానంలో ఒక క్రికెటర్ తో తారా స్థాయిలో వాగ్వాదం చేసినా, అంపైర్‌తో చెడుగా ప్రవర్తించినా అతడిని మైదానం నుంచి బయటకు పంపేస్తారు. ఈ నిబంధన పుట్‌బాల్‌లో ఎప్పటి నుంచో ఉండటంతో క్రికెట్‌లో కూడా అమలు చేశారు. ఇక అంతకుముందున్న ఐసీసీ లెవెల్ 1 నుంచి 3 వరకూ ఉన్న నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి.

బ్యాట్ సైజు

బ్యాట్ సైజు

గత కొంతకాలంగా బ్యాట్స్‌మెన్లు రకరకాల సైజుల్లో బ్యాట్లు వాడటంపై విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బ్యాట్ పొడవు, వెడల్పు విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, తాజా నిబంధన ప్రకారం బ్యాట్ ఓవరాల్ మందం మాత్రం 67mmకు మించకూడదు. అదే సమయంలో బ్యాట్ అంచు మందం మాత్రం 40mmను దాటి ఉండకూడదనే నిబంధనను కొత్తగా ప్రవేశపెట్టింది. బ్యాట్ సైజుని పరీక్షించేందుకు గాను అంఫైర్లకు ఐసీసీ విచక్షణాధికారాలను కట్టబెట్టింది.

డీఆర్ఎస్

డీఆర్ఎస్

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత అదనపు రివ్యూలు అమలు చేసే విధానానికి ఐసీసీ స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు విజయవంతం కాని రివ్యూలను ఉపయోగించుకునే వీలు కల్పించింది.

రనౌట్స్

రనౌట్స్

రనౌట్ అవుట్ విషయంలో కీలక మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్‌మెన్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచి ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అదే సమయంలో వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసినప్పటికీ బ్యాట్స్‌మెన్ మందుగా క్రీజులో బ్యాట్‌ను ఉంచాడు కాబట్టి నాటౌట్‌గా ప్రకటిస్తారు. స్టంపింగ్ విషయంలో కూడా దీనినే అమలు చేయనున్నారు.

బౌండరీ క్యాచ్‌లు

బౌండరీ క్యాచ్‌లు

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బౌలర్లు గాలిల్లోకి ఎగిరే బంతిని బౌండరీ లైన్ అవతల అందుకుని లోపలికి రావాలి. అలా కాని పక్షంలో దానిని బౌండరీగానే లెక్కించనున్నారు.

కొత్త నిబంధనలపై ఐసీసీ జనరల్ మేనేజర్

‘ఐసీసీ కొత్త రూల్స్‌పై అవగాహన కోసం ఇప్పటికే అంపైర్లకి వర్క్‌షాప్ నిర్వహించాం. నూతన మార్పులను అంపైర్లు చక్కగా అర్థం చేసుకున్నారు. సెప్టెంబరు 28 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వాటిని అమలు చేయనున్నాం' అని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అల్లారిస్ వెల్లడించారు.

భారత్, ఆస్ట్రేలియా సిరిస్‌కు వర్తించని కొత్త రూల్స్

భారత్, ఆస్ట్రేలియా సిరిస్‌కు వర్తించని కొత్త రూల్స్

ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కి మాత్రం ఐసీసీ కొత్త నిబంధనుల వర్తించవు. ఇప్పటికే సగం సిరీస్ ముగిసినందున కొత్త రూల్స్‌ని ప్రవేశపెడితే గందరగోళం నెలకొంటుందని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X