న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ: మ్యాచ్‌ని మలుపు తిప్పే ఆ బౌలర్లు వీరే (ఫోటోలు)

జూన్ 1 నుంచి ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్ పరిస్థితులు కాస్తంత భిన్నంగా ఉంటాయి. పచ్చటి పచ్చికతో కూడిన పిచ్‌లు..

By Nageshwara Rao

హైదరాబాద్: జూన్ 1 నుంచి ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్ పరిస్థితులు కాస్తంత భిన్నంగా ఉంటాయి. పచ్చటి పచ్చికతో కూడిన పిచ్‌లు.. పేస్‌కు స్వర్గధామమైన ఇంగ్లండ్‌ వికెట్లు.. సీమ్‌కు అనుకూలించే అక్కడి వాతావరణం ఫాస్ట్‌ బౌలర్లు ఎంతో కీలకం.

ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో బౌలర్లే కీలకపాత్ర పోషించనున్నారు. ఇటీవల కాలంలో బుల్లెట్లలాంటి బంతులు సంధిస్తూ బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసిరుతున్నారు. ప్రస్తుత ఛాంపియన్స్ లీగ్‌లో టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా ఓ కొత్త అస్త్రంగా బరిలోకి దిగుతోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా బుమ్రాకి పేరుంది.

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2013లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ బుమ్రాని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆ జట్టు ప్రధాన బౌలర్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ సాంగత్యంలో బుమ్రా అద్భుతమైన బౌలర్‌గా ఎదిగాడు.

ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటే బౌలర్లను ఒక్కసారి పరిశీలిస్తే:

మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)

మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా)

గత కొన్నాళ్లుగా మిచెల్‌ స్టార్క్‌ ఆస్ట్రేలియా బౌలింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. 27 ఏళ్ల ఈ లెఫ్టార్మ్‌ స్వింగ్‌ బౌలర్‌ ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీ‌స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. 65 వన్డేల్లో 129 వికెట్లు తీశాడు. అయితే ఈ మధ్య కాలంలో గాయాల బారిన పడ్డాడు. ఇది అతని కెరీర్‌ను ఇబ్బంది పెట్టింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సివున్నా గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకొన్నాడు. అదే సమయంలో చాంపియన్స్ ట్రోఫీ కోసం తన బౌలింగ్‌ను మెరుగు పరుచుకునేందుకు కసరత్తులు చేశాడు.

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

ప్రస్తుత ఛాంపియన్స్ లీగ్‌లో టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా ఓ కొత్త అస్త్రంగా బరిలోకి దిగుతోంది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా బుమ్రాకి పేరుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2013లో జరిగిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ బుమ్రాని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆ జట్టు ప్రధాన బౌలర్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ సాంగత్యంలో బుమ్రా అద్భుతమైన బౌలర్‌గా ఎదిగాడు.

మహమ్మద్‌ అమీర్‌ (పాకిస్థాన్)

మహమ్మద్‌ అమీర్‌ (పాకిస్థాన్)

నాణ్యమైన పేసర్లకు పాకిస్థాన్ పెట్టింది పేరు. అద్భుతమైన బౌలింగ్‌తో రాణిస్తున్న మహమ్మద్‌ అమీర్‌ స్పాట్‌-ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కొని కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే, ఐదేళ్ల వేటు అనంతరం గతేడాది బరిలోకి దిగిన అతను తన బౌలింగ్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. 2016 ఆసియాకప్‌లో, ఇంగ్లండ్‌తో వన్డే సిరీ‌స్‌లో పాక్‌ జట్టులో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో చివరిస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అమీర్‌ రికార్డుకెక్కాడు. 32 వన్డేల్లో 50 వికెట్లు తీశాడు.

కాగిసో రబాడ (దక్షిణాఫ్రికా)

కాగిసో రబాడ (దక్షిణాఫ్రికా)

రెండేళ్ల కిందటే కాగిసో రబాడ వన్డే అరంగేట్రం చేసినా.. దక్షిణాఫ్రికా జట్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. 34 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల ఈ యువ బౌలర్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రబాడ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అతను ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు మ్యాచలే ఆడడంతో తన మార్కు చూపలేకపోయినా చక్కటి బౌలింగ్‌ చేశాడు. బ్యాట్‌తోనూ మెరిసి ఆకట్టుకున్నాడు.

భువనేశ్వర్‌ కుమార్‌ (టీమిండియా)

భువనేశ్వర్‌ కుమార్‌ (టీమిండియా)

భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడు. భువనేశ్వర్‌ కుమార్‌ రాకతో గత రెండు మూడేళ్లుగా స్లాగ్‌ ఓవర్లలో టీమిండియా బౌలింగ్‌ చాలా మెరుగైంది. డెత్ ఓవర్లలో చక్కటి లెంగ్త్‌తో భువీ వేసే బంతులు ఎలాంటి బ్యాట్స్‌మెనకైనా సవాలే. ఆ సామర్థ్యం వల్లే ఐపీఎల్‌ కెప్టెన్లు భువీని తమ జట్టులోకి తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్లలో అతను బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడంటే మామూలు విషయం కాదు. ఆరంభంలో స్వింగ్‌ రాబట్టి.. ఆఖర్లో ఫుల్‌ లెంగ్త్‌ బాల్స్‌ విసిరే భువీకి ఇంగ్లాండ్‌ పరిస్థితులు మరింత బలం చేకూర్చనున్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కిచ్చే పర్పెల్ క్యాప్‌ని సొంతం చేసుకున్నాడు.

క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)

క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా)

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఉన్న ఆల్ రౌండర్లలో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ ఒకడు. 140 కిలోమీటర్ల వేగంతో అద్భుతమైన బౌలర్లను సంధించగలడు. డెత్ ఓవర్లలో క్రిస్ మోరిస్ బౌలింగ్ అద్భుతం. ఛాంపియన్స్ ట్రోఫీలో క్రిస్ మోరిస్ తన జట్టుకు అద్భుత విజయాలను సాధించాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ నేతృత్వంలో రాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

ముస్తాఫిజుర్‌ రహ్మాన్ (బంగ్లాదేశ్)

ముస్తాఫిజుర్‌ రహ్మాన్ (బంగ్లాదేశ్)

21 ఏళ్ల ఈ బంగ్లా బౌలర్‌ 2015లో మీర్పూర్‌ వన్డేలో భారత బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలు చేస్తూ అరంగ్రేటంలోనే సంచలనం సృష్టించాడు. తొలి వన్డేలోనే ఐదు వికెట్లు తీసిన బంగ్లాదేశ్ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అయితే ఆ తర్వాత అంచనాలను అందుకోలేక నిరుత్సాహపరిచాడు. గాయాలు కూడా అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ, 2016 ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. కట్టుదిట్టమెన బౌలింగ్‌తో 17 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన ఫిజ్‌ సన్‌రైజర్స్‌ విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సారి ఐపీఎల్‌ కాదని జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇచ్చిన రహ్మాన్.. గత నెలలో శ్రీలంకతో టీ20లో నాలుగు వికెట్లు తీశాడు.

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రూ. 14.5 కోట్లు పలికి బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం తన దేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రాణించాలని ఊవిళ్లూరుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X