న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అవార్డులు 2017: క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ

ICC Awards 2017

హైదరాబాద్: గడిచిన ఏడాది 2017ను పురస్కరించుకొని గురువారం ఐసీసీ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, లెగ్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్‌కు రెండు అవార్డులు దక్కాయి. కోహ్లీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌(సర్ గార్ ఫీల్డ్స్ సాబర్స్ ట్రోఫీ)గా, వన్డే క్రికెటర్‌గా అవార్డులు దక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియన్ స్కిప్పర్ స్టీవ్ స్మిత్ ఐసీసీ ర్యాంకుల్లో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గానూ అవార్డు అందుకున్నాడు.

చాహల్‌కు టీ 20 పర్ ఫార్మర్ ఆఫ్ ద ఇయర్‌గా ఖరారు చేసింది. బెంగుళూరులో ఇంగ్లాండ్‌తో ఆడి 6/25 స్కోరును సాధించుకున్నందుకు గాను అతనికి ఈ అవార్డు వరించింది.

పాకిస్థాన్ ఫేసర్ అయిన హసన్ అలీకి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2017లో 13 వికెట్లు పడగొట్టినందుకుగాను అతని జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. 2017 మొత్తానికి ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌ స్థానాన్ని అలీ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుకు స్పందించిన హసన్ అలీ మీడియాతో మాట్లాడుతూ 'నాకు ఈ అవార్డు దక్కడం చాలా గౌరవంగా అనిపిస్తోంది. ఇది పాకిస్థాన్‌కు నాకు చాలా గొప్ప విజయం.' అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.

అఫ్ఘనిస్థాన్‌కు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ హానర్ అవార్డును గెలుచుకున్నాడు. 19 ఏళ్ల ఈ ఆటగాడు 2017 సంవత్సరంలో 60 వికెట్లను తీయగలిగాడు.


2017 ఐసీసీ అవార్డు విజేతలు:

* Cricketer of the Year (Sir Garfield Sobers Trophy) - Virat Kohli (India)

* Test Cricketer of the Year - Steve Smith (Australia)

* ODI Cricketer of the Year - Virat Kohli (India)

* T20I Performance of the Year - Yuzvendra Chahal (India) - 6/25 versus England in Bengaluru

* Emerging Cricketer of the Year - Hasan Ali (Pakistan)

* Associate/Affiliate Cricketer of the Year - Rashid Khan (Afghanistan)

* Spirit of Cricket Award - Anya Shrubsole (England women's team)

* Umpire of the Year (David Shepherd Trophy) - Marais Erasmus

* Fans' Moment of the Year - Pakistan winning the ICC Champions Trophy 2017 beating India in England

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 12:25 [IST]
Other articles published on Jan 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X