న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ క్రికెటర్లకు రూ. 39 లక్షలతో ఐసీఏ చేయూత

ICA raises Rs 39 lakh for former players

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న 30 మంది మాజీ ఆటగాళ్లకు సాయం చేయాలని భారత క్రికెటర్ల అసోసియేషన్ (ఐసీఏ) నిర్ణయించింది. ఇప్పటివరకు రూ.39 లక్షల విరాళం సేకరించింది. దీనికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని దిగ్గజ ఆటగాళ్లు గవాస్కర్‌, కపిల్‌దేవ్‌ హామీ ఇచ్చారని ఐసీఏ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా శనివారం వెల్లడించాడు.

కాగా, బీసీసీఐ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చాముండేశ్వర్‌నాథ్‌ రూ.2 లక్షలు, మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌, రాజేంద్ర సింగ్‌ చెరో రూ.లక్ష, అన్షుమన్‌ గైక్వాడ్‌ రూ.50 వేలు ఇప్పటివరుకు ఇచ్చిన వారిలో ఉన్నారని మల్హోత్రా చెప్పాడు. బీసీసీఐ పింఛను కూడా రాని క్రికెటర్లను జోన్‌కు ఐదు లేదా ఆరుగురిని ఎంపిక చేసి వారికి సాయం చేయనున్నామని తెలిపారు.

ఇక భారత క్రికెటర్ల అసోసియేషన్ గతేడాదే ఏర్పాటవ్వగా.. 1750 మంది మాజీ క్రికెటర్లు ఐసీఏలో రిజిస్టర్ చేసుకున్నారు. బీసీసీఐ నుంచి ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల ఇన్షియల్ గ్రాంట్ అందుకున్న ఐసీఏ తన కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా..గత ఏడాది టీ20 వరల్డ్‌ క్రికెట్‌ సిరీస్‌ నెగ్గిన భారత దివ్యాంగ క్రికెట్‌ జట్టుకు హామీ ఇచ్చిన రూ. 60 లక్షలను బీసీసీఐ శనివారం విడుదల చేసింది.

ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ

Story first published: Sunday, May 3, 2020, 10:39 [IST]
Other articles published on May 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X