న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్‌ జట్టుకు దూరమైనప్పటి నుంచే కోహ్లీసేనకు వరుస పరాజయాలు'!!

Ian chappell says May be coincidence but India have not won since Rohit Sharma got injured

ఢిల్లీ: యాథృచ్ఛికం కావొచ్చు, ఓపెనర్ రోహిత్‌ శర్మ జట్టుకు దూరమైనప్పటి నుంచి కోహ్లీసేన వరుస పరాజయాలను చవిచూస్తోంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. న్యూజిలాండ్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కోవాలంటే సంయమనంతో కూడిన దూకుడును ప్రదర్శించాలన్నారు. ప్రస్తుతం ఆసీస్‌లో భారత మహిళా జట్టు రాణించిన విధంగా కోహ్లీసేన కూడా రాణించాలంటే భారీ స్కోరులు సాధించాలన్నారు.

<strong>న్యూజిలాండ్‌ పర్యటన.. కోహ్లీ ‌ఫామ్‌పై లక్ష్మణ్‌ ఏమన్నాడంటే!!</strong>న్యూజిలాండ్‌ పర్యటన.. కోహ్లీ ‌ఫామ్‌పై లక్ష్మణ్‌ ఏమన్నాడంటే!!

కివీస్‌లో ఎంతో జాగ్రత్తగా ఆడాలి

కివీస్‌లో ఎంతో జాగ్రత్తగా ఆడాలి

తాజాగా ఇయాన్‌ ఛాపెల్‌ మాట్లాడుతూ.... 'న్యూజిలాండ్‌ పిచ్‌లు ఇంగ్లాండ్‌ పిచ్‌ల మాదిరిగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో కంటే కూడా కివీస్‌లో ఎంతో జాగ్రత్తగా ఆడాలి. కానీ.. తొలి టెస్టులో ప్రపంచ నంబర్‌వన్‌ అయిన భారత్‌ 200 స్కోరు కూడా చేయలేకపాయింది. పూర్తిగా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే. బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంటే కళ్లు మూసుకుని ఆడే ఆటలా ఉండకూడదు. జట్టును సమతూకంగా మారేలా, ఆటగాళ్లు ఆ స్థానాల్లో సౌకర్యవంతంగా ఉండేలా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉండాలి. ఇదే జట్టుకు విజయావకాశాల్ని అందిస్తుంది' అని అన్నారు.

 పుజారా నిర్లక్ష్యపు షాట్లను ఆడకూడదు:

పుజారా నిర్లక్ష్యపు షాట్లను ఆడకూడదు:

'2018-19 ఆసీస్‌ పర్యటనలో భారత్‌ విజయం సాధించడానికి వన్‌డౌన్‌లో వచ్చిన ఛతేశ్వర పుజారా కీలక పాత్ర పోషించాడు. రోహిత్‌, మయాంక్‌ అగర్వాల్‌ తర్వాత.. విరాట్ కోహ్లీ ముందు పుజారా బ్యాటింగ్‌ చేయాలి. పుజారా స్ట్రోక్‌ ప్లేయర్లతో ఉంటూ బాధ్యతాయుతమైన షాట్లు ఆడుతుండాలి. నెట్‌ ప్రాక్టీస్‌లో మాదిరిగా పుజారా నిర్లక్ష్యపు షాట్లను ఆడకూడదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా అర్ధ శతకంతో రాణించాడు. అతడిని ఇప్పుడు విమర్శించలేం. అయితే ప్రతి ఇన్నింగ్స్‌లోనూ రాణించాలని ఆశించకూడదు' అని ఛాపెల్‌ పేర్కొన్నారు.

రోహిత్‌ దూరమైనప్పటి నుంచే:

రోహిత్‌ దూరమైనప్పటి నుంచే:

'టీమిండియా మొదటగా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆ వైఫల్యాలను టెస్టు సిరీస్‌లోనూ కొనసాగిస్తోంది. అయితే యాథృచ్ఛికంగా రోహిత్‌ జట్టుకు దూరమైనప్పటి నుంచి కోహ్లీసేన వరుస పరాజయాలను చవిచూస్తోంది. భారత్‌ మరోసారి కఠిన పర్యటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. త్వరలో ఆసీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆసీస్‌లో భారత మహిళా జట్టు రాణించిన విధంగా కోహ్లీసేన కూడా రాణించాలంటే.. అక్కడ భారీ స్కోరులు సాధించాలి' అని ఛాపెల్‌ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోల్పోవడానికి భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమే ప్రధాన కారణం.

రెండో టెస్టులోనూ ఓటమి:

రెండో టెస్టులోనూ ఓటమి:

హెగ్లే ఓవల్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (52; 74 బంతుల్లో 10x4), టామ్‌ బ్లండెల్‌(55; 113 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

Story first published: Monday, March 2, 2020, 14:10 [IST]
Other articles published on Mar 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X