న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఏబీకి బౌలింగ్ చేయాలని ఉంది, టాపార్డర్‌లో రాణించాలని ఉంది'

‘I would love to get AB de Villiers’ wicket’: Krishnappa Gowtham on IPL 2019

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2018 సీజన్‌కు తెరలేవనుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ను ఔట్‌ చేయడం తనకెంతో ఇష్టమని అంటున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌. హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పవర్‌ప్లేల్లో బౌలింగ్‌ చేయడం, అలాగే టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడమంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అంతేకాదు ఏబీ డివిలియర్స్‌కు బౌలింగ్‌ చేయాలని ఉందని.... అయితే, వ్యక్తిగత ఇష్టాలకన్నా జట్టు నిర్ణయాలకే తాను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణప్ప మాట్లాడుతూ "నాకు టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం ఇష్టం. అది జట్టు నిర్ణయంపై ఆధారపడింది. జట్టు నిర్ణయాలను కాదని సొంత నిర్ణయాలను తీసుకునే వాడిని కాదు" అని అన్నాడు.

"నా నుంచి మా జట్టు ఏం ఆశిస్తుందో అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. గతేడాది కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ మ్యాచ్‌లో నన్ను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. దురదృష్టవశాత్తూ ఆ మ్యాచ్‌లో సరిగ్గా ఆడలేదు. మరో అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకుంటా" అని గౌతమ్ కృష్ణప్ప అన్నాడు.

ఒక స్పిన్నర్‌గా పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడం కష్టమని, అయినా తాను రిస్క్‌ తీసుకొని బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. పవర్‌ ప్లే సమయంలో బ్యాట్స్‌మెన్‌కు పరుగులు రాబట్టేందుకు మంచి అవకాశం ఉంటుందని అదే సమయంలో పరుగులను నియంత్రించడం బౌలర్‌ సత్తాను తెలియజేస్తుందని తెలిపాడు.

టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. శనివారం రాత్రి 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. మరోవైపు మార్చి 25న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుతో తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Story first published: Saturday, March 23, 2019, 15:09 [IST]
Other articles published on Mar 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X