న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా'

I was assessing the conditions on the first ball of every over says Deepak Chahar

గయానా: ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా. అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా అని టీమిండియా యువ పేస్ బౌలర్ దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో గెలుచుకోవడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ పలు మార్పులు చేసింది. యువ ఆటగాళ్లకు జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. 2019 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుత ప్రదర్శన చేయడంతో దీపక్‌ చాహర్‌ ఏడాది విరామం తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ ఆడాడు.

<strong>ఆర్మీలో విధులు.. అమితాబ్ పాటతో తోటి సైనికులను అలరించిన ధోనీ</strong>ఆర్మీలో విధులు.. అమితాబ్ పాటతో తోటి సైనికులను అలరించిన ధోనీ

3 ఓవర్లు.. 4 పరుగులు:

3 ఓవర్లు.. 4 పరుగులు:

మూడో టీ20లో దీపక్‌ సూపర్ స్పెల్ వేసాడు. తన తొలి ఓవర్లోనే ఓపెనర్ సునీల్ నరైన్‌ (2) వికెట్‌ తీసాడు. రెండో ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. మరో ఓపెనర్ లూయిస్‌ (10), హెట్‌మైర్‌ (1)లను ఎల్బీడబ్ల్యూలుగా ఔట్‌ చేయడంతో పాటు మెయిడిన్‌గా ముగించాడు. ఇక మూడో ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన దీపక్‌.. 3-1-4-3 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. దీంతో దీపక్‌ చాహర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది.

పాత బంతులతో సాధన చేస్తా:

పాత బంతులతో సాధన చేస్తా:

అవార్డుల ప్రదానోత్సవంలో దీపక్‌ చాహర్‌ మాట్లాడుతూ... 'వాతావరణం చాలా బాగుంది. వాతావరణం, పిచ్ అనుకూలంగా ఉన్నందున బంతిని స్వింగ్ చేయడానికి ప్రయత్నించా. తేమ కారణంగా బంతిని రెండు వైపులా చేయడానికి కూడా ప్రయత్నించా. పరిస్థితుల కారణంగా అవుట్-స్వింగర్స్ కంటే ఎక్కువగా ఇన్-స్వింగర్స్ వేసాను. ఇన్-స్వింగర్స్ ఆడడం బ్యాట్స్‌మన్‌కు కొంచెం కష్టమే. సాధారణంగా పాత బంతులతో నెట్స్‌లో బౌలింగ్ చేస్తా. దీంతో నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటా. ఒకవేళ బంతి బాగా స్వింగ్ అవుతున్నప్పుడు వైవిధ్య బంతులు వేయను. ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా. అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా' అని చాహర్‌ తెలిపాడు.

 బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు:

బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు:

మ్యాచ్ అనంతరం దీపక్‌ చాహర్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్ ఇద్దరూ ఒకటే. కొత్త బంతితో భువిలాగే దీపక్‌ ఆడగలడు. కొత్త బంతితో దీపక్‌ ప్రమాదకారి. తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు. ఐపీఎల్-12లో కూడా అతని ప్రదర్శన బాగుంది' అని కోహ్లీ తెలిపాడు.

బీసీసీఐపై గుంగూలీ ఫైర్.. భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి!!

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌:

సిరీస్‌ క్లీన్‌స్వీప్‌:

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేసాడు. చహర్‌ 3, సైనీ 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో రిషభ్‌ పంత్‌ (42 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (45 బంతుల్లో 59; 6 ఫోర్లు) మూడో వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో భారత్ 19.1 ఓవర్లలో సునాయాస విజయాన్ని అందుకుంది.

Story first published: Wednesday, August 7, 2019, 15:50 [IST]
Other articles published on Aug 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X