For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐపై గుంగూలీ ఫైర్.. భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి!!

Sourav Ganguly Slams BCCI For Sending Notice To Rahul Dravid || Oneindia Telugu
Sourav Ganguly slams BCCI over sending conflict of interest notice to Rahul Dravid

కలకత్తా: టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసులు ఇవ్వడంపై మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి అని తన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు.

ఆ దేవుడే కాపాడాలి:

ఈ విషయంపై గంగూలీ స్పందించారు. 'ఎథిక్స్‌ ఆఫీసర్‌ నోటీసులు ద్రవిడ్‌కు జారీ చేశారు. భారత క్రికెట్‌లో ఇదొక కొత్త ఫ్యాషన్‌ అయింది. నిత్యం వార్తల్లో నిలవడానికి బీసీసీఐకి ఇంతకంటే వేరే మార్గం దొరకలేదేమో. ఇక భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి' అని గుంగూలీ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. గుంగూలీ కెప్టెన్‌గా ఉన్నపుడు ద్రవిడ్‌ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

లెజెండ్‌కు నోటీసులా:

సౌరవ్ గుంగూలీ ట్వీట్‌పై భారత వెటరన్ స్పిన్ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా స్పందించారు. 'నిజంగా??.. అసలు ఇది ఎక్కడికి వెళుతుందో తెలియదు. భారత క్రికెట్‌లో అతనికంటే మంచి వ్యక్తి మీకు దొరకరు. అటువంటి లెజెండ్‌కు నోటీసులు పంపడం అవమానించడమే. క్రికెట్‌ మంచి కోసం ఆయన సేవలు ఎంతో అవసరం. అవును భారత క్రికెట్‌ను ఆ దేవుడే కాపాడాలి' అని భజ్జీ రాసుకొచ్చారు.

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు:

రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం ఎన్‌సీఏ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు వైస్‌ ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఉంది. ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు వైస్‌ ఛైర్మన్‌గా ఉండడంతో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు.

సుష్మాస్వరాజ్‌ మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా: కోహ్లీ

ద్రవిడ్‌కు నోటీసులు:

ద్రవిడ్‌కు నోటీసులు:

ఫిర్యాదు స్వీకరించిన బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌.. ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చాడు. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించాడు. గతంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగానే ఐపీఎల్‌ మెంటార్‌ పదవి వదులుకుని భారత జూనియర్‌ కోచ్‌ పదవి చేపట్టాడు ద్రవిడ్‌. మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి ద్రవిడ్‌ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఇంతకుముందు క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లపై కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు.

Story first published: Wednesday, August 7, 2019, 14:00 [IST]
Other articles published on Aug 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+