న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియాలో మరో ధోనీ కావాలనుంది'

I Want to Be Like MS Dhoni, Says Krunal Pandya

హైదరాబాద్: ఫామ్ లేమితో ధోనీ.. ఆసియా కప్‌లో గాయం కారణంగా హార్దిక్ పాండ్యాలు తప్పుకోవడం టీమిండియా మరో ఇద్దరికి అవకాశం దక్కేలా చేశాయి. అలా మున్ముందు జరగబోయే సిరీస్‌లలో ఆడనున్న కృనాల్ పాండ్యా. రిషబ్ పంత్‌లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్ జట్టులో ధోనీలా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు యువ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇంగ్లాండ్‌ వేదికగా టీ20 సిరీస్‌కి కూడా

ఇంగ్లాండ్‌ వేదికగా టీ20 సిరీస్‌కి కూడా

వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు.. అందులో కృనాల్ పాండ్య‌ాకి చోటిచ్చిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ వైఫల్యాన్ని పూరించేందుకు టీమిండియా సెలక్టర్లు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌కి కూడా అప్పట్లో కృనాల్‌ను ఎంపిక చేశారు. కానీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

ర్యాంకుల్లో తనతో పాటు భారత్‌నూ టాప్‌లో నిలిపిన కోహ్లీ

తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు

తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు

ఎడమచేతి వాటం స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండటంతో కృనాల్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు అతను గాయపడటంతో.. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌లో కృనాల్ పాండ్య‌ాకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతోన్న కృనాల్ పాండ్య‌ తాజాగా మీడియాతో మాట్లాడాడు.

అందరితోనూ సింపుల్‌గా.. చూసి ఆశ్చర్యపోయా.

అందరితోనూ సింపుల్‌గా.. చూసి ఆశ్చర్యపోయా.

‘మహేంద్రసింగ్ ధోనీతో కేవలం ఆరు రోజులు మాత్రమే కలిసి ఉండే అవకాశం అప్పట్లో (ఇంగ్లాండ్ గడ్డపై) నాకు దక్కింది. ఆ సమయంలో అతని నిరాడంబరత, ఒదిగి ఉండేతత్వం నన్ను ఆకట్టుకున్నాయి. గొప్ప విజయాలు సాధించినా.. అందరితోనూ అతను సింపుల్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. ధోనీలా ఎదగాలి, ఉండాలని' అని కృనాల్ పాండ్య‌ా వెల్లడించాడు.

Story first published: Friday, November 2, 2018, 15:16 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X