ర్యాంకుల్లో తనతో పాటు భారత్‌నూ టాప్‌లో నిలిపిన కోహ్లీ


హైదరాబాద్: పడుతూ లేస్తూ ఉన్న టాప్ పొజిషన్‌ను కోహ్లీ సుస్థిరం చేసుకున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డే మ్యాచ్‌లు అతని కెరీర్‌కు ఎన్నో రికార్డులు తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో పరుగుల యంత్రం కోహ్లీ కూడా పరుగులు దండుకుని పదివేల పరుగుల క్లబ్‌లోనూ చేరుకున్నాడు. గురువారం వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలోనూ దుమ్ము దులిపేసిన కోహ్లీ.. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టాప్‌గా నిలిచాడు.

ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లీ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 935 పాయింట్లతో కోహ్లీ నెంబర్ వన్‌గా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్, బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాదిపాటు నిషేధంలో ఉన్న స్టీవ్ స్మిత్ 910 పాయింట్లతో టాప్‌లో ఉండేవాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్టుల్లో ఓ సారి కోహ్లీకి టాప్ 1 స్థానం దక్కినా ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. ఈ సారి మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ధోనీ ఆశించాడు.. కాబట్టే టీ20 నుంచి తప్పుకున్నాడు: కోహ్లీ

కోహ్లీ.. స్మిత్‍లతో పాటుగా టాప్ 5లో:
కోహ్లీ.. స్మిత్‍లతో పాటుగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (847), ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (835), డేవిడ్ వార్నర్ (803) టాప్ 5లో ఉన్నారు. భారత టెస్టు బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా (765) పాయింట్లతో జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నా.. ఆసీస్ స్టార్ క్రికెటర్లు టాప్ 5లో కొనసాగడం గమనార్హం.

బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ.. జట్టుగా భారత్..
టీమ్ పరంగా టెస్ట్ ర్యాంకుల్లో భారత్ నంబర్ వన్‌లో కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేన 116 పాయింట్లతో ఉంది. దక్షిణాఫ్రికా (106), ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (102), ఆస్ట్రేలియా (102) టాప్ 5లో నిలిచాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications