న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడు.. ఆ తర్వాతే రిటైర్మెంట్‌!!

Dhoni Will Play The World T20 Next Year, Says Dhoni’s Childhood Coach || Oneindia Telugu
I think MS Dhoni will play 2020 World T20 says childhood coach Keshav Banerjee

రాంచీ: వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్‌ ధోనీ ఆడుతాడని నేను అనుకుంటున్నా. ఆ తర్వాతే ధోనీ తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడు అని అతని చిన్నప్పటి కోచ్‌ కేశవ్‌బెనర్జీ తెలిపారు. వన్డే ప్రపంచకప్‌ 2019 అనంతరం ధోనీ జట్టుకు అందుబాటులో ఉండకపోవడంతో అతని రిటైర్మెంట్‌కు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశవ్‌బెనర్జీ పైవిధంగా స్పందించారు.

ఉమేశ్‌ సిక్సర్ల మోత.. భారత్ 497/9 డిక్లేర్‌.. దక్షిణాఫ్రికా 8/2ఉమేశ్‌ సిక్సర్ల మోత.. భారత్ 497/9 డిక్లేర్‌.. దక్షిణాఫ్రికా 8/2

విరామం ఎంతో అవసరం:

విరామం ఎంతో అవసరం:

తాజాగా కేశవ్‌బెనర్జీ మాట్లాడుతూ... 'ధోనీ 2004 నుంచి విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. అతనికి విరామం ఎంతో అవసరం. కుటుంబంతో కలిసి ఉండటానికి అతనికి కాస్త సమయం ఇవ్వండి. వచ్చే ఏడాది జరగబోయే 2020 టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడతాడనే నేను అనుకుంటున్నా. ఆ తర్వాతే ధోనీ తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడు. ధోనీ సరైన సమయంలోనే రిటైర్మెంట్‌ ఇస్తాడు' అని అన్నారు.

 యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి:

యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి:

'ధోనీ జట్టులోకి రావడం కన్నా.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే ఇప్పుడు ముఖ్యం. దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తూ రాణిస్తున్న వారికి అవకాశాలు ఇవ్వాలి. మంచి ప్రతిభ ఉన్న వారిని అక్కడే ఆడించి వారి కెరీర్లను నాశనం చేయొద్దు. సెలెక్టర్లు ఈ విషయాన్ని ఆలోచించాలి. వచ్చే నెలలో జరగబోయే బంగ్లాదేశ్‌ సిరీస్‌ యువ ఆటగాళ్లని పరీక్షించేందుకు సరైన వేదిక' అని కేశవ్‌బెనర్జీ పేర్కొన్నారు.

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

క్రికెట్‌కు తాత్కాలిక విరామం:

ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.

ధోనీతో మాట్లాడుతా:

ధోనీతో మాట్లాడుతా:

ప్రస్తుతం ధోనీ పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లే ఉంది. ఒకవైపు మ్యాచ్‌లు ఆడటం లేదు.. అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. తాను ఆడాలనుకునే సిరీస్‌లు తనే ఎంపిక చేసుకుంటున్నాడు. ధోనీ సెలక్టర్లకు ఏం చెప్పాడో వారికి మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని వారు బయటికి చెప్పడం లేదు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అయితే సౌరవ్ గంగూలీ తాజాగా స్పందిస్తూ... 'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ధోనీ భవితవ్యంపై సెలక్టర్లతో చర్చిస్తా. ఆ తర్వాత ధోనీతోనూ మాట్లాడుతా' అని అన్నారు.

Story first published: Sunday, October 20, 2019, 18:23 [IST]
Other articles published on Oct 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X