న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బయటికి రావడానికే భయమేసింది: 'కాఫీ' వివాదంపై కేఎల్ రాహుల్

IPL 2019: K L Rahul Revealed He Was Scared To Face Uncomfortable Questions From Outsiders | Oneindia
I started doubting my character, wasnt ready to face people: KL Rahul on Koffee controversy

హైదరాబాద్: తన ప్రవర్తన, వ్యక్తిత్వంపై తనకే అనుమానం కలిగిందని ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్ కేఎల్ రాహుల్ అన్నాడు. రెండు నెలల కిందట 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. దీంతో వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు కూడా వేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో వీరిద్దరూ న్యూజిలాండ్‌ పర్యటన మొత్తానికి దూరమయ్యారు. పాండ్యా, రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ ఈ వ్యవహారంపై బీసీసీఐ విచారణ ఇంకా ముగియలేదు. తాజాగా ఆ వివాదంపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని వెల్లడించాడు.

జనాలు నా పట్ల అయిష్టత చూపడం

జనాలు నా పట్ల అయిష్టత చూపడం

"జనాలు నా పట్ల అయిష్టత చూపడం ఇంతకుముందెన్నడూ నాకు అనుభవం లేదు. ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో పడిపోయా. నా ప్రవర్తన, వ్యక్తిత్వంపై నాకే అనుమానం కలిగేది. నా మీద మీడియాలో వచ్చిన వార్తల గురించి ఆలోచిస్తే.. నిజంగా నేను అంత చెడ్డవాడినా.. అనే సంశయం లోలోన తొలిచేసేది" అని అన్నాడు.

బయటికి రావడానికే భయమేసింది

బయటికి రావడానికే భయమేసింది

"ఆ సమయంలో బయటికి రావడానికే భయమేసింది. వస్తే ఎవరో ఒకటి ఏదో అడుగుతారు. వాటికి జవాబివ్వగలనో లేదో నాకు తెలియదు. ప్రాక్టీస్‌కు వెళ్లడం, ఇంటికి రావడం.. అంతే తప్ప జనాల్ని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం లేకపోయింది'' అని రాహుల్‌ అన్నాడు. టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి ఆకర్షణ మోజులో అసలు మూలాలు, శ్రేయోభిలాషులకు కొంత దూరమయ్యానని రాహుల్‌ అంగీకరించాడు.

అంతర్జాతీయ స్థాయిలో తరచుగా ఆడుతుంటే

అంతర్జాతీయ స్థాయిలో తరచుగా ఆడుతుంటే

"అంతర్జాతీయ స్థాయిలో తరచుగా ఆడుతుంటే మన నిజమైన స్నేహితులెవరు, మనకు కుటుంబం ఎంత ముఖ్యమైంది అని మరిచిపోవడానికి, అదుపు తప్పడానికి ఆస్కారముంది. నేను చాన్నాళ్లు విరామం లేకుండా భారత జట్టుతో పాటు తిరుగుతూనే ఉన్నా. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో దూరం పెరిగింది. స్నేహితులకు దూరమైతే మనం సామాన్యులుగా ఉన్నపుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో మరిచిపోతాం" అని అన్నాడు.

ఈ ఘటన తన కళ్లు తెరిపించింది

ఈ ఘటన తన కళ్లు తెరిపించింది

అయితే, ఈ ఘటన తన కళ్లు తెరిపించిందని రాహుల్ చెప్పాడు. అయితే, సస్పెన్షన్‌ పడటంతో ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వచ్చాక అందరూ తనకు అండగా నిలిచారని, భారత జట్టు సభ్యులు కూడా ధైర్యం ఇచ్చారని రాహుల్‌ చెప్పాడు. తప్పులు ఎవరైనా చేస్తారని, అలాంటపుడు అందుకు తగ్గ శిక్షలు కూడా ఎదుర్కోక తప్పదని రాహుల్‌ చెప్పాడు.

Story first published: Thursday, March 28, 2019, 13:58 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X