న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నన్ను బలి పశువును చేశారు: కెప్టెన్సీ తొలగింపుపై మాథ్యూస్‌ ఆవేదన

Im a scapegoat says sacked Sri Lanka captain Mathews

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శనతో శ్రీలంక జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ఏంజెలో మాథ్యూస్‌‌ను సోమవారం తప్పించింది.

ఆసియా కప్: సారథిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మఆసియా కప్: సారథిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

దీనిపై ఏంజెలో మాథ్యూస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌లో తమ జట్టు లీగ్‌ దశ నుంచే నిష్క్రమించడాన్ని సాకుగా చూపుతూ వన్డే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పుకొచ్చాడు. జట్టు చెత్త ప‍్రదర్శనకు తనను బలి పశువును చేశారని మాథ్యూస్‌ విమర్శించాడు.

నన్ను బలి పశువును చేశారు

నన్ను బలి పశువును చేశారు

అంతేకాదు అవసరమైతే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ నుంచి వైదొలగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డుని ఏంజెలో మాథ్యూస్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా మాథ్యూస్‌ మాట్లాడుతూ "ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌, అప్ఘన్‌లపై శ్రీలంక పేలవ ప‍్రదర్శనకు నన్ను బలి పశువును చేశారు" అని అన్నాడు.

కెప్టెన్సీ నుంచి ఉన‍్నపళంగా తప్పించారు

కెప్టెన్సీ నుంచి ఉన‍్నపళంగా తప్పించారు

"నన్ను కెప్టెన్సీ నుంచి ఉన‍్నపళంగా తప్పించారు. ఈ విషయంలో నన్ను ఒక్కడినే బాధ్యున్ని చేయడం సబబేనా?" అని శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు మాథ్యూస్‌ లేఖ రాశాడు. అయితే, టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 137 పరుగుల తేడాతో ఓడిపోగా, ఆ తర్వాత పసికూన ఆప్ఘన్‌ చేతిలో సైతం ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 సమర్ధించుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు

సమర్ధించుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు

దీంతో, జనవరి 2017 నుంచి శ్రీలంక ఆడిన 40 వన్డేల్లో 30 వన్డేల్లో ఓటమి పాలు కావడం విశేషం. అయితే, పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మాథ్యూస్‌ను తప్పించడాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సమర్ధించుకుంది. దినేశ్‌ చండీమాల్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పే క్రమంలోనే మాథ్యూస్‌ను తప్పించినట్లు పేర్కొంది.

 అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు

అక్టోబర్ 10 నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు

త్వరలో ఇంగ్లాండ్‌ పర‍్యటనకు బయల‍్దేరనున్న సందర్భంలో కెప్టెన్‌ను మార్చినట్లు బోర్డు తెలిపింది. ప్రస్తుతం దినేశ్ చండీమాల్ శ్రీలంక టెస్టు జట్టుకు సారథిగా వ్యవహారిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు అక్టోబర్ 10 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆడనుంది.

Story first published: Monday, September 24, 2018, 14:54 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X