న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని, క్రిస్ గేల్‌ లాంటి వాడినికాదు: డబుల్ సెంచరీ అనంతరం రోహిత్ శర్మ

By Nageshwara Rao
I just went through my routine – Rohit delighted with latest double hundred

హైదరాబాద్:పెళ్లిరోజు తాను ఇచ్చిన బహుమతి (డబుల్ సెంచరీ) తన భార్యకు నచ్చి ఉంటుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'నేను ఎప్పటిలాగే ఆడాను. బంతి టైమింగ్‌ను చూసి ఆడతా. బంతి పడే సమయానికి లైన్ చూసుకుని బాదుతా. నాకు తెలుసు, నేను మహేంద్ర సింగ్ ధోని లేదా క్రిస్ గేల్ కాదు. వాళ్లకు ఉన్నంత రిస్ట్ పవర్ కూడా లేదు. బంతి టైమింగ్‌ను బట్టి నేను ఆడతా' అని అన్నాడు.

India v/s Sri Lanka: 2017 has been ‘best year’ for me, says Rohit Sharma

'ఎక్కవ సేపు క్రీజులో ఉండాలని భావించా. మొహాలి వికెట్ సూపర్బ్‌గా ఉంది. ఔట్ ఫీల్డ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని నాకు నేనుగా చెప్పుకున్నా. అదే చేశా' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు.

వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు క్రీజులో ఉండి 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే రెండో వన్డేలో చేసిన డబుల్ సెంచరీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది.

డిసెంబర్ 13 రోహిత్ శర్మ పెళ్లిరోజు. దీనిపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. 'పెళ్లిరోజు నా భార్య నాతో పాటే ఉన్నందుకు ఆనందంగా ఉంది. నేను ఇచ్చిన బహుమతి (డబుల్ సెంచరీ) ఆమెకు కచ్చితంగా నచ్చివుంటుంది. నా బలం ఆమే. రితిక ఎప్పుడూ నాకు అండగా నిలుస్తుంది. ఎంతో ఒత్తిడితో కూడిన క్రికెట్‌ మ్యాచ్‌ల సందర్భంగా.. మనవాళ్లు మనతోనే ఉండటం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మ్యాచ్‌లో విజయమే అంతకంటే ముఖ్యమైంది' అని అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 17:43 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X