న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జలుబు చేసిందంతే.. అంతకుమించి ఏమీ కాలేదు: ఫెర్గూసన్‌

I just had very, very mild cold: Lockie Ferguson after coronavirus concerns

ఆక్లాండ్‌: చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో కాస్త జలుబు చేసినా.. హైరానా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌కు ఎదురైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత ఫెర్గూసన్‌ గొంతు నొప్పికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన కివీస్ జట్టు మేనేజ్మెంట్ వెంటనే అతడిని ప్రత్యేక వార్డుకు చేర్చింది.

టీ20 ప్రపంచకప్‌ స్టార్ దీప్తిశర్మకు అరుదైన గౌరవం!!టీ20 ప్రపంచకప్‌ స్టార్ దీప్తిశర్మకు అరుదైన గౌరవం!!

ఫెర్గూసన్‌కు కరోనా నెగిటివ్‌:

ఫెర్గూసన్‌కు కరోనా నెగిటివ్‌:

జట్టు బస చేసిన హోటల్‌లో ఫెర్గూసన్‌ను ప్రత్యేకంగా ఉంచింది. కరోనా వైరస్‌కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు.. 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్‌ రూమ్‌లోనే నిర్బంధించింది. ఇక శనివారం అతని రిపోర్ట్‌లు నెగెటివ్‌గా రావడంతో.. ఫెర్గూసన్‌తో పాటు కివీస్ బోర్డు ఊపిరి పీల్చుకొంది. ఇక కరోనా కారణంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ సిరీస్ రద్దవడంతో.. ఫెర్గూసన్‌ ఆక్లాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు.

కాస్త జలుబు చేసిందంతే:

కాస్త జలుబు చేసిందంతే:

ఆక్లాండ్‌ చేరుకున్న లాకీ ఫెర్గూసన్‌ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. 'నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. జట్టు వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ.. మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది' అని ఫెర్గూసన్‌ పేర్కొన్నాడు.

రిచర్డ్‌సన్‌కు గొంతు నొప్పి:

రిచర్డ్‌సన్‌కు గొంతు నొప్పి:

తొలి వన్డేకు ముందు ఆసీస్‌ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెంటనే అతనికి కరోనా పరీక్షలు చేయించింది. అతడికి నెగెటివ్‌ అని రిపోర్ట్‌ రావడంతో జట్టు సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రిచర్డ్‌సన్‌కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్‌సన్‌కు బదులు సీన్‌ అబాట్‌ను సీఏ ఎంపిక చేసింది. అయితే టెస్టుల అనంతరం రిచర్డ్‌సన్‌ మైదానానికి వెళ్ళాడు. సిరీస్ రద్దవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు.

వన్డే సిరీస్‌ రద్దు:

వన్డే సిరీస్‌ రద్దు:

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ అర్థంతరంగా రద్దు చేసుకుంది. అయితే వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చే వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చిన వారిని ఏయిర్‌ పోర్ట్‌లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్‌ పర్యటనలో ఉన్న కివీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ అప్రమత్తం అయింది.

Story first published: Monday, March 16, 2020, 9:05 [IST]
Other articles published on Mar 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X