న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. మీరు ఆస్ట్రేలియాలో గెలుస్తారని ఆశిస్తున్నా: గంగూలీ

I expect you to win in Australia: Sourav Ganguly to Virat Kohli

ముంబై: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనల్లో భారత్‌ గెలవాలని తాను ఆశిస్తున్నట్లు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. మరో మూడు నెలల్లో భారత్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మూడు టీ20 మ్యాచ్‌ల సరీస్‌ కోసం అక్టోబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. తరువాత 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌, మూడు వన్డే సిరీస్‌లలో ఇరు జట్లు తలపడనున్నాయి. డిసెంబర్ 3 నుంచి గబ్బాలో సిరీస్‌లు జరుగనున్నాయి.

చివరిసారి కోహ్లీసేన ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు 2-1తో భారత్ సిరీస్ గెలిచి చరిత్రను తిరగరాశారు. ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి ఆసియా దేశంగా నిలిచింది. సిరీస్ గెలిచిన తొలి భారత సారథిగా విరాట్ కోహ్లీ కూడా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈఏడాది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టులోకి తిరిగి రావడంతో ఆసీస్ పటిష్టంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బాలాలు, బలహీనతలను అంచనా వేసి బరిలోకి దిగాలని యోచిస్తోంది.

ఈ సిరీస్ గురించి సౌరవ్ గంగూలీ ఇటీవల ఇండియా టుడేతో మాట్లాడాడు. 'విరాట్ కోహ్లీ.. నీతో పాటు జట్టు ప్రమాణాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. మీరు ఆడటానికి మైదనంలోకి దిగినప్పుడు, మీ ఆటను టీవీలో చూస్తున్నప్పుడు ఆస్ట్రేలియాతో బాగా ఆడుతున్నారని నేను ఆశించవద్దు. మీరు గెలుస్తారని నేను ఆశించాలి. ఎందుకంటే మీరు ప్రమాణాలను నిర్ణయించారు. మీరు గెలుస్తారని నేను ఖచ్చితంగా అనుకోవాలి' అని కోహ్లీతో చెప్పినట్టు దాదా తెలిపాడు.

'నేను విరాట్ కోహ్లీతో సన్నిహితంగా ఉన్నా. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రా, ఇషాంత్‌ శర్మ, హార్దీక్‌ పాండ్యా అందరు బౌలర్లు ఉత్తమ ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలి. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పుడు వారి ఫిట్‌నెస్‌తో మ్యాచ్ అగ్రస్థానంలో ఉండాలి' అని గంగూలీ అన్నాడు. 'ఇది కఠినమైన సిరీస్ అవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగా ఉంది. కానీ మేము గెలుస్తాం అనే నమ్మకం ఉంది. ఎందుకంటే మావాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయగలరు' అని దాదా ఆశించాడు.

ఆమిర్‌ సోహేల్‌ ఫోర్ బాది నన్ను రెచ్చగొట్టాడు.. ఆ నెక్ట్స్ బంతికే వికెట్ తీశా: వెంకటేశ్‌ఆమిర్‌ సోహేల్‌ ఫోర్ బాది నన్ను రెచ్చగొట్టాడు.. ఆ నెక్ట్స్ బంతికే వికెట్ తీశా: వెంకటేశ్‌

Story first published: Tuesday, July 14, 2020, 21:05 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X