న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్‌ను గమనిస్తా.. దాన్ని బట్టే స్పందిస్తా: పృథ్వీ షా

India vs West Indies 2018 : Prithvi Shaw To Make His Test Debut In Rajkot
I dont pre-meditate before an innings: Prithvi Shaw

న్యూ ఢిల్లీ: టీమిండియా అండర్-19గా వ్యవహరించి ప్రపంచ కప్ దక్కేలా చేసిన పృథ్వీ షా సీనియర్ జట్టులో సెలక్టయ్యాడు. వెస్టిండీస్‌తో జరగబోయే తొలి టెస్టు తుది జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ భారత్ ఏ జట్టులోనూ నిలకడగా రాణిస్తూ పరుగులు సంపాదిస్తున్నాడు. ఈ ఫామ్‌ను చూసి సెలక్షన్ కమిటీ పృథ్వీ షాను జాతీయ జట్టులోకి తీసుకుంది. ఇలా ఎంపికవడం పట్ల పృథ్వీ షా ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

I dont pre-meditate before an innings: Prithvi Shaw
బాల్‌ను గమనిస్తా.. దాన్ని బట్టే స్పందిస్తా:

బాల్‌ను గమనిస్తా.. దాన్ని బట్టే స్పందిస్తా:

ఈ క్రమంలోనే సీనియర్లతో పాటుగా తాను బ్యాటింగ్ ఎలా చేయాలో ప్లాన్ చేసుకున్నాడు పృథ్వీ. బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వెళ్లేటప్పుడు నా మైండ్‌లో ఏం ఉంచుకోను. ఏ పథకంతోనూ బ్యాటింగ్‌కు సిద్ధమవ్వను. వచ్చే బాల్‌ను గమనిస్తా.. దాన్ని బట్టే స్పందిస్తా. ఇలా రెండు మూడు ఓవర్లు బ్యాటింగ్ చేస్తా. ఆ తర్వాత నా స్టైల్‌లో షాట్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్‌లో నెట్టుకురావడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అలా చేయగలిగితేనే ఇక్కడ నిలబడగలం.

జట్టుకు పరుగులు ఆలోచనలోనే

జట్టుకు పరుగులు ఆలోచనలోనే

ముంబై.. కర్ణాటకల మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన పృథ్వీ.. నేను నా జట్టుకు ఎక్కువ పరుగులు తీసుకురావాలనే ఆలోచనలోనే ఉంటాను. స్కోరు బోర్డులో పరుగులపరంగా టాప్‌లో ఉండేందుకే ప్రయత్నిస్తాను. పరిస్థితులని బట్టి జట్టులో ఉంటామా.. బయటికి వెళ్లిపోతామా అనే సందేహం నాకెప్పుడూ లేదు. నేను వందశాతం బాల్‌ని ఎలా ఎదుర్కొన్నామా అనే ఆలోచిస్తా. బంతి ఎలా వస్తోంది. దానిని షాట్ కొట్టి ఎలా పంపామనేదే ఆలోచన.

 వెనకడుగు వేయించేందుకు ప్రయత్నిస్తా

వెనకడుగు వేయించేందుకు ప్రయత్నిస్తా

బౌలర్ మనల్ని వెనకడుగు వేయించాలని ప్రయత్నించినప్పుడు నేనే వాళ్లని వెనకడుగు వేయించేందుకు ప్రయత్నిస్తా. బౌలర్ బంతి వేయకముందే బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించను. బాల్ వేసిన తర్వాత దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే దానిని ఎదుర్కొంటా. బాల్‌కు స్పందించడమనేది ఫార్మాట్‌లను బట్టి మారుతుంది. టీ20లకు ఆలోచించకుండా ఆడేసినా సరిపోతుంది. కానీ, వన్డే, టెస్టు సిరీస్‌లకు మాత్రం అలా చేయడానికి వీల్లేదు. అది ఇన్నింగ్స్‌లో మొదటి బాల్ అయినా.. బౌన్సర్ అయినా నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే దానిని ఎదుర్కొంటా.

జూనియర్.. సీనియర్‌లు ఉండరని వాళ్లే నన్ను

జూనియర్.. సీనియర్‌లు ఉండరని వాళ్లే నన్ను

ఇంగ్లాండ్ పర్యటనలో లెజెండ్స్‌తో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. వాళ్లు నాపై చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. నా బ్యాటింగ్ సమయంలోనూ వాళ్లు నాకు సహాయం చేశారు. ఇక్కడ జూనియర్.. సీనియర్‌లు ఉండరని వాళ్లే నన్ను ప్రోత్సహించేవారు. టెక్నికల్‌గానే కాకుండా మైండ్ సెట్ పరంగా కూడా నేను రాహుల్ ద్రవిడ్ సర్ నుంచి చాలా నేర్చుకున్నా. అండర్ 19 టీమిండియాకు కోచ్‌గా, భారత్ ఏ జట్టుకు కోచ్‌గా ఆయన నాకెంతో సాయం చేశారు. ఇక ఐపీఎల్ ఆడినప్పుడు జట్టు కోచ్ రిక్కీ పాంటింగ్‌ది భిన్నమైన వ్యక్తిత్వం. ఆయన నుంచి కూడా చాలా నేర్చుకున్నా.

Story first published: Wednesday, October 3, 2018, 18:50 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X