న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U-19 Cricket World Cup: తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్కడు, ఎవరీ తిలక్ వర్మ?

U-19 Cricket World Cup : Lets Meet Hyderabad Batsman Thakur Thilak Varma || Oneindia Telugu
Hyderabad batsman Thakur Thilak Varma To Play U-19 Cricket World Cup In South Africa


హైదరాబాద్:
ఠాకూర్‌ తిలక్‌ వర్మ... ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. అందుకు కారణం భారత్ నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవ్వడమే. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఏజ్ ఫ్రాడ్: ఢిల్లీ ప్లేయర్ ప్రిన్స్ రామ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ ఏజ్ ఫ్రాడ్: ఢిల్లీ ప్లేయర్ ప్రిన్స్ రామ్‌పై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ

ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ఠాకూర్‌ తిలక్‌ వర్మకు చోటు దక్కింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ అయిన తిలక్ వర్మ... ఆఫ్‌ స్పిన్ బౌలింగ్‌ కూడా వేస్తాడు. టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్‌‌ రైనాను అమితంగా ఇష్టపడతాడు. చిన్నప్పటి నుంచి తిలక్‌‌‌‌ వర్మకు క్రికెట్‌‌‌‌ తప్ప వేరే వ్యాపకం లేదు.

తిలక్‌ వర్మ తండ్రి చిరుద్యోగి

తిలక్‌ వర్మ తండ్రి చిరుద్యోగి

తిలక్‌ వర్మ తండ్రి చిరుద్యోగి. తల్లి ఓ సాధారణ గృహిణి. కుమారుడిలో ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించిన తల్లిదండ్రులు తిలక్‌ను క్రికెట్‌ వైపు నడిపించారు. ఓ క్యాంప్‌‌‌‌లో కోచ్‌‌‌‌ సలామ్​ బయాష్​ దృష్టిలో పడడం ఠాకూర్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో టర్నింగ్‌‌‌‌ పాయింట్. టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌తో తిలక్‌‌‌‌ ఆట చూసి ఇంప్రెస్‌‌‌‌ అయిన సలామ్ అతనిలో స్పార్క్‌‌‌‌ను గమనించాడు.

కోచింగ్‌‌‌‌ ఇస్తే మంచి క్రికెటర్‌‌‌‌ అయ్యే సత్తా

కోచింగ్‌‌‌‌ ఇస్తే మంచి క్రికెటర్‌‌‌‌ అయ్యే సత్తా

కోచింగ్‌‌‌‌ ఇస్తే మంచి క్రికెటర్‌‌‌‌ అయ్యే సత్తా అతనిలో ఉందని గుర్తించాడు. అలా పదేళ్ల వయసులోనే కోచ్‌ సలామ్ దగ్గర శిక్షణలో చేరాడు. సలామ్ చాంద్రాయణ గుట్టలో ఉండేవారు. అతని అకాడమీ ఏమో లింగంపల్లిలో ఉండేది. దీంతో తన ఇంటి నుంచి రోజు శేరిలింగంపల్లిలోని లేగలా అకాడమీకి రోజూ 80 కిలోమీటర్లు ప్రయాణించేవాడు.

ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు

ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు

ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కోచ్‌‌‌‌ ఏం చెబితే అది చేయడం తిలక్‌‌‌‌ దినచర్య. ఎన్ని గంటలు ప్రాక్టీస్‌‌‌‌ చేసినా కూడా అస్సలు అలసిపోయే వాడు కాదు. దాంతో ఏడాది తిరిగేలోపే అతను అండర్‌‌‌‌-14 రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఆడిన తొలి సీజన్‌‌‌‌లోనే బెస్ట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అవార్డు అందుకున్నాడు.

2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో

2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో

2017 హెచ్‌సీఏ లీగ్స్‌లో తొలిసారి తిలక్‌ వర్మ పేరు తెరపైకివచ్చింది. గంటల తరబడి బ్యాటింగ్‌ చేస్తుండటం.. భారీ పరుగులు తీస్తుండటంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా అండర్‌-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత అఖిల భారత విజయ్‌ మర్చంట్‌ అండర్‌-16 క్రికెట్‌ టోర్నీలో ఆడాడు. ఈ టోర్నీలో 690 పరుగులతో రాణించాడు.

ఆంధ్రతో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్

ఆంధ్రతో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్

గతేడాది రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో ఆడిన తిలక్ వర్మ.... ఇటీవల జరిగిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలోనూ దిగాడు. ఈ ఏడాది జనవరిలో ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటివరకు తిలక్ వర్మ 6 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు, మూడు టీ20లు ఆడాడు.

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు

ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ చంద్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, దివ్యాన్ష్‌ సక్సేనా, శషావత్‌ రావత్‌, దివ్యాన్ష్‌ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తిక్‌ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమాల్ కుషాగ్ర, సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌.

Story first published: Tuesday, December 3, 2019, 16:09 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X