న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్కరోజు 'సీఈఓ'గా మహేంద్ర సింగ్ ధోని (ఫోటోలు)

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త అవతారం ఎత్తాడు. ఓ కంపెనీకి ఒక్కరోజు సీఈఓ అయ్యాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త అవతారం ఎత్తాడు. ఓ కంపెనీకి ఒక్కరోజు సీఈఓ అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్‌గా కొనసాగుతున్న ధోని ఓ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా. ధోనీకి ఒక్కరోజు సీఈఓగా బాధ్యతలు నిర్వహించే ఛాన్స్ వచ్చింది.

దీంతో 'గల్ఫ్‌ ఆయిల్‌ ఇండియా' కంపెనీ సీఈఓ బాధ్యతలను తీసుకున్నాడు. ఆ పదవిలో ధోనీ పలు సమావేశాలకు కూడా హాజరయ్యాడు. ఒక కార్పొరేట్‌ సీఈఓగా బాధ్యతలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ధోనీకి ఉందని.. గల్ఫ్‌ ఆయిల్‌ ఇండియా వాణిజ్య వ్యవహారాలు చూస్తున్న అరుణ్‌ పాండే తెలిపాడు.

How MS Dhoni became CEO of an oil company for a day

2011లో గల్ఫ్‌ ఆయిల్‌ ఇండియా తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీని నియమించుకుంది. ఈ నేపథ్యంలో ధోని సోమవారం ఒక్కరోజు సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. మైదానంలో కెప్టెన్ కూల్‌గా ఉన్న ధోని సూట్‌లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈఓ కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు.

సీఈఓగా చేసిన ధోనీ కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడని అరుణ్‌ పాండే తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే మీడియాకు వివరించారు. ప్రస్తుతం ధోని ఐపీఎల్ 10వ సీజన్ కోసం సన్నధ్దమవుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X