న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడు గంటలో సెంచరీ చేస్తానని చెప్పాడు.. అలానే చేశాడు: బాలాజీ

He told me he is going to score a hundred in an hour: L Balaji praise on Subramaniam Badrinath

చెన్నై:‌ ఒక రంజీ మ్యాచ్‌కు ముందే మరో గంటలో సెంచరీ చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తనతో చెప్పినట్లు మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీ గుర్తుచేసుకున్నాడు. మరొక మ్యాచ్‌లో బద్రీనాథ్ అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాది జట్టును ఆదుకున్నాడని తెలిపాడు. రంజీ క్రికెట్‌ ఆడే రోజుల నుంచే తనకు బద్రీ తెలుసని బాలాజీ చెప్పాడు.

'ధోనీ కెరీర్ ఇంకా ముగియలేదు.. అతడిని అర్థం చేసుకోవడం అసాధ్యం''ధోనీ కెరీర్ ఇంకా ముగియలేదు.. అతడిని అర్థం చేసుకోవడం అసాధ్యం'

'గంటలో సెంచరీ చేస్తానన్నాడు:

'గంటలో సెంచరీ చేస్తానన్నాడు:

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిర్వహించే 'ఫార్ములా ఫర్‌ సక్సెస్‌' అనే యూట్యూబ్‌ షోలో లక్ష్మీపతి బాలాజీ మాట్లాడుతూ సుబ్రమణ్యం బద్రీనాథ్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఇదే షోలో బద్రీ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అశ్విన్‌.. బద్రీతో పాటు బాలాజీని పలు విషయాలను అడిగాడు. ఈ క్రమమంలో బద్రీనాథ్‌ బ్యాటింగ్‌ గురించి అడగ్గా.. బాలాజీ స్పందించాడు. 'గంటలో సెంచరీ చేయబోతున్నాను చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా?. నేను 2005లో చూశాను. ఒక దశలో ఉత్తమ స్పిన్నర్లు బౌలింగ్ చేసినా.. బద్రీనాథ్ వారిపై ఆధిపత్యం చెలాయించాడు. రంజీ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే ఒక సెషన్‌లో శతకం ఎలా బాదగలడో చూపించాడు' అని బాలాజీ చెప్పాడు.

అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడు:

అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడు:

'బద్రీ కాలేజ్‌ డేస్‌ నుంచే నెమ్మదిగానే ఆడేవాడు. అయితే అంత తేలిగ్గా వికెట్‌ మాత్రం ఇవ్వడు. బద్రీనాథ్ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేస్తాడని అంటారు కానీ అతడిలో మరో కోణం కూడా ఉంది. పరిస్థితులకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటాడు. కాలం గడిచేకొద్దీ ఓ ఆటగాడు ఎలా అభివృద్ధి చెందుతారనే దానికి సుబ్రమణ్యం బద్రీనాథ్ గొప్ప ఉదాహరణ. అతను వేగంగా బ్యాటింగ్ చేయగలడు.ఈ తరహాలో ఐపీఎల్‌లో బాగా ఆడాడు. ఇది మనందరికి తెలుసు' అని లక్ష్మీపతి బాలాజీ అన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో బాలాజీ 8 టెస్టుల్లో, 30 వన్డేల్లో, 5 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

అంబులెన్స్‌లో వచ్చి శతకం బాదాడు:

అంబులెన్స్‌లో వచ్చి శతకం బాదాడు:

'ఒకసారి మహారాష్ట్రలో ఆడేటప్పుడు బద్రీనాథ్ డీహైడ్రేషన్‌కు గురైతే.. మలార్ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ తర్వాత తమిళనాడు వికెట్లు కోల్పోయినప్పుడు అంబులెన్స్‌లో వచ్చి మరీ శతకం బాదాడు. ఆ సెంచరీతో జట్టును కాపాడాడు. బద్రీ గురించి ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవు. అతడు చాలా చేయగలడు' అని మాజీ పేసర్ బాలాజీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బద్రినాథ్ ప్రాతినిథ్యం వహించాడు. 2010, 2011లో చెన్నై టైటిల్ విజేతగా నిలవడంతో తనవంతు పాత్ర పోషించాడు. ఇక భారత జట్టులో కూడా మహీ కెప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.

32 సెంచరీలు:

32 సెంచరీలు:

సుబ్రమణ్యం బద్రీనాథ్‌ 2018లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టీమిండియా తరుపున 2008 నుంచి 2011 మధ్య కాలంలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. రంజీ క్రికెట్‌లో తమిళనాడుకు 14 ఏళ్ల పాటు మిస్టర్ డిపెండబుల్‌గా బద్రినాథ్ సేవలందించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 145 మ్యాచ్‌లాడిన బద్రినాథ్..‌ 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. దాంట్లో 32 సెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, August 1, 2020, 18:01 [IST]
Other articles published on Aug 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X