న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ రికార్డు సేఫ్: వన్డేల్లో రెండో ఆటగాడిగా ఆమ్లా అరుదైన ఘనత

Hashim Amla crosses 8000+ ODI runs, 2nd fastest to this milestone after Virat Kohli

హైదరాబాద్: ఎడ్జిబాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆమ్లా 24 పరుగులు చేయడంతో వన్డేల్లో అత్యంత అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 176 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికా తరఫున 8000 పరుగులు అందుకున్న నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలయర్స్‌ 182 ఇన్నింగ్స్‌లలో 8వేల పరుగులను పూర్తి చేసాడు.

ఆ తర్వాత సౌరవ్‌ గంగూల్‌, రోహిత్‌ శర్మ, రాస్‌ టేలర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. అంతకుముందు జాక్వస్ కలీస్‌(11550), ఏబీ డివిలియర్స్‌ (9427), హార్ష్‌లే గిబ్స్‌(8094)లు ఈ జాబితాలో ఆమ్లా కన్నా ముందు వరుసలో ఉన్నారు. కాగా, వన్డేల్లో రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల పరుగులను ఆమ్లానే అత్యంత వేగంగా అందుకున్న సంగతి తెలిసిందే.

నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా ఆమ్లా పేలవ ప్రదర్శన కనబరుస్తుడటంతో ఈ రికార్డు మరింత ఆలస్యం అయింది. 36 ఏళ్ల ఆమ్లాకి ఇదే ఆఖరి వరల్డ్‌కప్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

1
43668
Story first published: Wednesday, June 19, 2019, 18:30 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X