న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిగ్‌బాష్ లీగ్‌ నాలుగో సీజన్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్

Harmanpreet Kaur, Smriti Mandhana continue association with womens BBL

హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే నాలుగో సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మరోసారి ఆడేందుకు సిద్ధమయ్యారు. బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన.. హోబార్ట్ హరికేన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ తరఫున బరిలో దిగనుంది.

Hockey World Cup Opening Ceremony: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలిHockey World Cup Opening Ceremony: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి

భారత మహిళల టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి మంధాన ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన ఉమెన్స్ క్రికెట్ సూపర్ లీగ్‌లో వెస్టర్న్ స్టార్మ్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌లో 421 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది.

గత సీజన్‌లో మంధాన బ్రిస్బేన్ హీట్‌కు ప్రాతినిధ్యం వహించగా తాజాగా హోబర్ట్ హరికేన్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా హోబర్ట్ హరికేన్స్‌ కోచ్ సల్లియన్ బ్రిగ్స్ మాట్లాడుతూ "వరల్డ్ స్టేజిలో మంధాన ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. వరల్డ్ టీ20లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన ప్రదర్శనను చూశా. త్వరలోనే ఆమెను ఉదా రంగు డ్రెస్సులో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా" అని తెలిపింది.

మరోవైపు భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గతేడాది సీజన్‌లో సిడ్నీ థండర్స్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మొత్తం 12 ఇన్నింగ్స్‌ల్లో 296 పరుగులు రాబట్టింది. దీంతో ఈ సీజన్‌లో కూడా సిడ్నీ తరఫున సత్తాచాటేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.

Story first published: Tuesday, November 27, 2018, 13:56 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X