న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పొవారే మాకు కోచ్‌గా కావాలి: కెప్టెన్, వైస్ కెప్టెన్

Harmanpreet Kaur, Smriti Mandhana bat for Ramesh Powar continuation as coach

న్యూ ఢిల్లీ: సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్, కోచ్ రమేశ్ పొవార్ వివాదం తెలిసిందే. మిథాలీని టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ మ్యాచ్‌కు పక్కన పెట్టడం ద్వారా తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు కోచ్‌ రమేశ్‌ పొవార్‌. కోచ్ తనను మానసికంగా వేధించారని, తన దేశభక్తిని శంకించారంటూ బీసీసీఐకి లేఖ రాసి వాపోయింది. దీంతో పొవార్‌ వ్యవహారశైలిపై విమర్శలొచ్చాయి. కోచ్‌గా అతడి తాత్కాలిక కాంట్రాక్టు ముగిసిన నేపథ్యంలో కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు కూడా ఆహ్వానించింది.

రమేశ్ పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలని కోరుతూ:

రమేశ్ పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలని కోరుతూ:

కానీ రమేశ్ పొవార్‌ను కోచ్‌గా కొనసాగించాలని కోరుతూ టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, వైస్‌కెప్టెన్‌ స్మృతి మంధాన బీసీసీఐకి లేఖ రాశారు. 15 నెలల్లో న్యూజిలాండ్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో పొవార్‌ కోచ్ అయితే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సీఓఏ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ కూడా ధ్రువీకరించారు.

ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసి

ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసి

‘ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. వివాదాలు జట్టు ప్రతిష్ఠను దెబ్బ తీయడం బాధించింది. తర్వాతి టీ20 ప్రపంచకప్‌కు ఇంకో 15 నెలల సమయమే ఉంది. న్యూజిలాండ్‌ పర్యటన ఇంకో నెల రోజుల్లో మొదలవుతుంది. ఇలాంటి సమయంలో కోచ్‌ను మారిస్తే అది జట్టు ప్రగతిపై ప్రభావం చూపుతుంది. కొత్త కోచ్‌ సున్నా నుంచి మొదలుపెట్టాలి. కాబట్టి పొవార్‌నే కోచ్‌గా కొనసాగించాలి. అతను జట్టును మార్చిన తీరు అమోఘం. అతడి స్థానంలో మరొకరిని తేవాల్సిన అవసరమే లేదు. '

క్రికెటర్లుగా మమ్మల్ని మెరుగుపరచడమే

క్రికెటర్లుగా మమ్మల్ని మెరుగుపరచడమే

‘పొవార్‌ క్రికెటర్లుగా మమ్మల్ని మెరుగుపరచడమే కాదు.. మమ్మల్ని మేం సవాలు చేసుకునేలా స్ఫూర్తి నింపాడు. భారత మహిళల క్రికెట్‌ ముఖచిత్రాన్నే అతను మార్చేశాడు. మాలో గెలుపు కాంక్షను పెంచాడు. అతను వచ్చాక వరుస విజయాలు సాధించాం. మిథాలీపై వేటుకు పొవార్‌ ఒక్కడే కారణం కాదు. చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుని, ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. మిథాలీ, రమేశ్‌ మధ్య విభేదాలకు కారణం ఏదైనప్పటికీ.. ఒక కుటుంబంలా భావించి సర్దుబాటు చేసుకోవాలి. అది జట్టుకు మేలు చేస్తుంది'

పొవార్‌ మాత్రమే కారణం కాదని

పొవార్‌ మాత్రమే కారణం కాదని

మిథాలీని తప్పించడానికి పొవార్‌ మాత్రమే కారణం కాదని వారు స్పష్టం చేశారు. కాగా.. ఏక్తా బిష్త్, మాన్సి జోషిలు మిథాలీకి మద్దతినిస్తున్న తెలుస్తోంది. కోచ్‌గా రమేశ్ పొవార్‌ను కొనసాగించడం పట్ల వీరు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పొవార్‌ ఇప్పుడు మరోసారి కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. హర్మన్‌, స్మృతిల మద్దతున్న నేపథ్యంలో పొవార్‌ మళ్లీ కోచ్‌ పదవిలో నిలుస్తాడనే భావిస్తున్నారు.

Story first published: Tuesday, December 4, 2018, 9:36 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X